PV Sindhu : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లోకి దూసుకొచ్చింది. దాదాపు మూడేళ్ల తర్వాత పదో ర్యాంక్ సాధించింది తెలుగు తేజం. ఈమధ్య కాలంలో ఒక్కంటే ఒక్క టైటిల్ సాధించలేకపోయినప్పటికీ.. ఇండోనేషియా ఓపెన్ (Indonasia Open)లో అద్భుత విజయంతో సింధు టాప్-10లో చోటు సంపాదించింది. థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫన్ను చిత్తు చేసిన భారత స్టార్ 16వ రౌండ్లో అడుగుపెట్టమే కాకుండా తన ర్యాంకింగ్‌ను మెరుగుపరచుకుంది.
జూన్ 1 సోమవారం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(BWF) ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో సింధు 11వ స్థానంలో నిలిచింది. మంగళవారం వరస సెట్లలో థాయ్‌లాండ్ షట్లర్‌ను ఓడించడం ద్వారా ఒక స్థానం ఎగబాకి పదో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.
The Queen is back in the Top 10! 👑
After 136+ weeks, PV Sindhu climbs back to where she belongs. The fight never stops. 🇮🇳🔥
A moment of immense pride! 🙌✨ pic.twitter.com/PzGlZC1HPX
— BAI Media (@BAI_Media) June 2, 2026
రెండుసార్లు ఒలింపిక్ విజేతగా చరిత్ర సృష్టించిన పీవీ సింధు చాలా రోజులకు టాప్-10 ర్యాంకర్‌గా నిలిచింది. గత రెండేళ్లుగా పలు టోర్నీల్లో క్వార్టర్స్, సెమీస్‌లోనే నిష్క్రమిస్తున్న తెలుగు తేజం.. ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000లో విజయంతో పదో ర్యాంక్ పట్టేసింది.
తొలి రౌండ్లో బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ గట్టి పోటీనిచ్చినా మొదటి సెట్‌ను 25-23తో గెలిచిన సింధు.. రెండో సెట్లో దూకుడుగా ఆడి 21-16తో 16వ రౌండ్‌కు దూసుకెళ్లింది. ఈ రౌండ్లో తను వరల్డ్ నంబర్ 1 అన్ సే యంగ్(దక్షిణ కొరియా)ను ఢీకొట్టనుంది.