Trent Boult | వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలని ఉంది : బౌల్ట్
2022 ఆగష్టు 10వ తేదీన బౌల్ట్ కాంట్రాక్టు రద్దుకు న్యూజిలాండ్ క్రికటె్ ఆమోదం
Trent Boult : న్యూజిలాండ్ ఫాస్ట్ బౌరల్ ట్రెంట్ బౌల్ట్ పోయిన ఏడాది జాతీయ కాంట్రాక్టు వదులుకుని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఆగష్టు 10వ తేదీన అతడి కాంట్రాక్టు రద్దుకు న్యూజిలాండ్ క్రికటె్ ఆమోదం తెలిపింది. సెంట్రల్ కాంట్రాక్టు వదులుకోవడానికి కుటుంబంతో గడపాలని అనుకోవడమే కారణం అని తెలిపాడు. టెస్టుల్లో తన ప్రదర్శన పట్ల గర్వపడుతున్నానని, వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలని అనుకుంటున్నట్టు ఔల్ట్ తాజాగా వెల్లడించాడు. ‘టెస్టు క్రికెట్లో నేను సాధించిన ఘనతల పట్ల చాలా గర్వ పడుతున్నా. అయితే.. నాకు ముగ్గురు చిన్నపిల్లలు. విదేశీ పర్యటనల్లో ఆడి అలసిపోవడం కంటే వాళ్లతో సమయం గడపాలి అనుకున్నా. అందుకనే కాంట్రాక్టు రద్దు చేసుకున్నా. నేను కాంట్రాక్టు వదులుకోవడం వల్ల మరొక ఆటగాడికి అవకాశం లభిస్తుంది’ అని అని బౌల్ట్ వెల్లడించాడు. ఈ ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్ టెస్టుల్లో 317 వికెట్లు తీశాడు. వన్డేల్లో 169, టీ20ల్లో 62 వికెట్లు పడగొట్టాడు.
ఈ పేసర్ ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలని అనుకుంటున్నాడు. వన్డే వరల్డ్ కప్‌లో మరిన్ని వికెట్లు తీయాలనుకుంటున్నా అని బౌల్ట్ తెలిపాడు. 2023 వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అతని మాదిరిగానే మిగతా క్రికెటర్లు దేశం కంటే లీగ్స్‌కే ప్రాధాన్యం ఇవ్వడం పట్ల న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ ఆందోళన చెందుతోంది. యువ క్రికెటర్లు కూడా బౌల్ట్ దారిలో వెళ్తే పరిస్థితి ఏంటి? అనేది ఆ దేశ క్రికెట్‌ను కలవర పెడుతోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

