IP[L 2025 : ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య(29), ప్రభ్‌సిమ్రన్ సింగ్(25)లు దూకుడుగా ఆడుతున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లను ఉతికేస్తూ స్కోర్ బోర్డును పరగులు పెట్టిస్తున్నారు. హర్షిత్ రానా వేసిన 5వ ఓవర్లో సిక్సర్ బాదిన ప్రభ్‌సిమ్రన్.. స్కోర్ 50 దాటించాడు. వీళ్లిద్దరూ ధనాధన్ ఆడుతుండడంతో అయ్యర్ సేన పవర్ ప్లేలో 56 రన్స్ కొట్టింది.
టాస్ గెలిచిన పంజాబ్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. వైభవ్ అరోరా వేసిన తొలి బంతికే ప్రియాన్ష్ ఆర్య(29) బౌండరీ రాబట్టాడు. ఔట్ సైడ్ పడిన చివరి బంతిని ఫోర్‌గా మలిచాడు. ఆ తర్వాత చేతన సకారియా 3 పరుగులే ఇచ్చాడు. అయితే.. సకారియా రెండో ఓవర్లో రెచ్చిపోయిన ప్రియాన్ష్, ప్రభ్‌సిమ్రన్‌లు బౌండరీలతో చెలరేగారు. 18 పరుగులు పిండుకున్నారు.
A lot of 𝗽𝗼𝘄𝗲𝗿 in their 𝗽𝗹𝗮𝘆 👊
Priyansh Arya and Prabhsimran Singh get #PBKS off to another rapid start 🏃
56/0 after 6 overs 👏
Updates ▶ https://t.co/oVAArAbbHv #TATAIPL | #KKRvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/0a29rjFwI8
— IndianPremierLeague (@IPL) April 26, 2025