హైదరాబాద్: ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ ప్లేయర్ ప్రియాంక సాగర్ మూడు స్వర్ణాలు సహా రజత పతకంతో మెరిసింది. అమృత్‌సర్‌లోని గురునానక్‌దేవ్ యూనివర్సిటీలో గురువారం జరిగిన వేర్వేరు విభాగాల్లో ప్రియాంక సత్తాచాటింది. ఆల్‌రౌండ్ చాంపియన్‌షిప్‌తో పాటు హుప్, క్లబ్ ఈవెంట్లలో స్వర్ణాలు దక్కించుకోగా, బాల్ కేటగిరీలో రజతం కైవసం చేసుకుంది.