ఒలింపిక్స్‌కు ముందు ఏడాది ఆసియా గేమ్స్!
నాలుగేండ్లకోసారి జరిగే ఆసియా క్రీడలను ఒలింపిక్స్‌కు ముందు ఏడాది నిర్వహించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. సాధారణంగా ఒలింపిక్స్‌కు రెండేండ్ల ముందు జరిగే ఈ క్రీడలను ఒక ఏడాది ముందుకు జరిపేందుకు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
ఢిల్లీ: నాలుగేండ్లకోసారి జరిగే ఆసియా క్రీడలను ఒలింపిక్స్‌కు ముందు ఏడాది నిర్వహించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. సాధారణంగా ఒలింపిక్స్‌కు రెండేండ్ల ముందు జరిగే ఈ క్రీడలను ఒక ఏడాది ముందుకు జరిపేందుకు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ మేరకు ఇటీవలే సన్యా (చైనా)లో సమావేశమైన ఓసీఏ ఎగ్జిక్యూటివ్ బోర్డ్‌లో చర్చ జరిగినట్టు తెలుస్తున్నది.
ఇలా చేయడం ద్వారా విశ్వక్రీడలకు నేరుగా ఆసియా గేమ్స్ క్వాలిఫికేషన్ ఈవెంట్గానూ నిర్వహించే అవకాశం ఉంటుంది. తద్వారా అథ్లెట్లకు వరల్డ్ చాంపియన్‌షిప్స్, ఇతర ఈవెంట్లలో పాల్గొనాల్సిన పని ఉండదు. ప్రస్తుతం ఆసియా క్రీడల్లో 40 క్రీడాంశాలుండగా ఒకవేళ ఒలింపిక్స్‌కు ముందు ఏడాది గనుక నిర్వహిస్తే విశ్వక్రీడలకు తగ్గట్టుగా క్రీడాంశాలనూ పెంచే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారమే (సెప్టెంబర్ అక్టోబర్‌లో జపాన్ వేదికగా) జరిగే ఆసియా క్రీడలను దోహాలో జరగాల్సిన 2030 ఎడిషన్‌ను 2031కు మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Asian Games
- china
- OCA
- Olympics
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

