సిడ్నీ: స్టార్ ఇండియన్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్.. ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో అతను ఇండియాకే చెందిన మరో షట్లర్ ప్రియాన్షు రజావత్‌ను ఓడించాడు. వరల్డ్ నెంబర్ 9 ర్యాంక్‌లో ఉన్న ప్రణజ్ఞ్.. కేవలం 43 నిమిషాల్లో ప్రత్యర్థిని మట్టికరిపించాడు. 21-18, 21-12 స్కోర్‌తో రాజావత్పై విజయం సాధించాడు. ఈ గెలుపుతో ప్రణయ్ తొలిసారి సూపర్ 500 టోర్నీలో సెమీస్‌లోకి ఎంటరయ్యాడు. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్తో ప్రణయ్ తలపడనున్నాడు.
𝐓𝐇𝐄 𝐁𝐄𝐀𝐒𝐓 𝐄𝐍𝐓𝐄𝐑𝐒 𝐅𝐈𝐍𝐀𝐋 🤩💥
2️⃣nd Super 500 final on #BWFWorldTour this year 🚀
📸: @badmintonphoto #AustraliaOpen2023#IndiaontheRise#Badminton pic.twitter.com/YTUyVeYeky
— BAI Media (@BAI_Media) August 5, 2023