RR vs SRH | టేబుల్ టాపర్‌ను వణికించిన కుర్ర పేసర్లు.. సన్‌రైజర్స్‌కు రెండో విజయం..!
RR vs SRH : పంతొమ్మిదో సీజన్లో వరస ఓటములకు సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) గుడ్ బై చెప్పేసింది. సొంత గడ్డపై అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)ను చిత్తుగా ఓడించింది.
RR vs SRH : పంతొమ్మిదో సీజన్లో వరస ఓటములకు సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) గుడ్ బై చెప్పేసింది. సొంత గడ్డపై అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)ను చిత్తుగా ఓడించింది. ఇషాన్ కిషన్(91) బ్యాటుతో విధ్వంసం సృష్టిస్తే.. కుర్ర పేసర్లు ప్రఫుల్ హింగే(4-34), షకీబ్ హుస్సేన్(4-24)లు రాజస్థాన్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. ప్రఫుల్ ఒకే ఓవర్లో మూడు వికెట్లతో టాపార్డర్‌ను కూల్చగా.. టెయిలెండర్లను హుస్సేన్ మడతపెట్టేశాడు. అంతే.. సన్‌రైజర్స్ జట్టు ఉప్పల్ మైదానంలో సగర్వంగా, సంబురంగా గెలుపు తోవ తొక్కింది.
ఐపీఎల్లో బ్యాటర్లనే నమ్ముకొనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఈసారి బౌలర్లు గెలిపించారు. ఈ సీజన్లో ఓడిన మూడు మ్యాచుల్లో బౌలర్లే విలన్లు.. కాగా ఉప్పల్ స్టేడియంలో మాత్రం పోటీపడి వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్‌కు తొలి ఓటమి రుచి చూపించారు. 217 పరుగుల ఛేదనలో తొలి ఓవర్లోనే ప్రఫుల్ హింగే (4-34) మూడు వికెట్లతో చరిత్ర సృష్టించాడు. మొదటి బంతికే వైభవ్ సూర్యవంశీ(0)ని బోల్తా కొట్టించాడీ కుర్రాడు. పెద్ద షాట్ ఆడాలనుకున్న వైభవ్ బంతిని వికెట్ల వెనకాల గాల్లోకి లేపగా.. వికెట్ కీపర్ సలీల్ అరోరా ఒడుపుగా అందుకున్నాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే ధ్రువ్ జరెల్(0)ను బౌల్డ్ చేశాడీ పేసర్.
Vaibhav Sooryavanshi ✅
Dhruv Jurel ✅
Lhuan-dre Pretorius ✅A dream start for Praful Hinge on his #TATAIPL debut 🧡
Updates ▶️ https://t.co/xGTDdKbXpY#KhelBindaas | #SRHvRR | @SunRisers pic.twitter.com/wLOPGPCqgR
— IndianPremierLeague (@IPL) April 13, 2026
అంతేనా.. అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న ప్రిటోరియస్(0)ను ఔట్ చేసి రాజస్థాన్‌ను గట్టి దెబ్బ కొట్టాడు ప్రఫుల్. ఆ తర్వాతి ఓవర్లో యశస్వీ జైస్వాల్(1)ను షకీబ్ హుస్సేన్ ఔట్ చేయడంతో 2 పరుగులకే రాజస్థాన్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఇక ఆ జట్టు చిత్తుగా ఓడడం ఖాయమనుకున్న వేళ రవీంద్ర జడేజా(48), డొనొవాన్ ఫెరీరా(69) క్రీజులో పాతుకుపోయారు. సన్‌రైజర్స్ బౌలర్లను విసిగిస్తూ.. సింగిల్స్, డబుల్స్ దొంగిలించారు. కాస్త కుదురుకున్నాక గేర్ మార్చిన ఫెరీరా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని ఎట్టకేలకు ఫెరీరాను బౌల్డ్ చేసి విడదీశాడు హుస్సేన్. కాసేపటికే మలింగ ఓవర్లో జడ్డూ వెనుదిరిగాడు. మరోసారి బంతి అందుకున్న హుస్సేన్ రెండు వికెట్లు తీసినా.. ఆఖర్లో తుషార్ దేశ్‌పాండే(25) సిక్సర్లతో హోరెత్తించాడు. కానీ, మలింగ ఓవర్లో షాట్ గురి తప్పగా ఇషాన్ చేతికి చిక్కాడు. దాంతో.. రాజస్థాన్ 159కి కుప్పకూలగా 57 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ గెలుపొందింది.
Flexing his muscles 💪
Donovan Ferreira keeping #RR‘s hopes alive in the chase 👏
Updates ▶️ https://t.co/xGTDdKbXpY#TATAIPL | #KhelBindaas | #SRHvRR | @rajasthanroyals pic.twitter.com/2h17PZRvbh
— IndianPremierLeague (@IPL) April 13, 2026
ఇషాన్ తుఫాన్ ఇన్నింగ్స్
సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు చితక్కొట్టారు. ఓపెనర్లు విఫలమైనా కెప్టెన్ ఇషాన్ కిషన్ (91) తుఫాన్ ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టాస్ ఓడిన హైదరాబాద్‌కు జోఫ్రా ఆర్చర్ తొలి బంతికే షాకిచ్చాడు. ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మను(0) గోల్డెన్ డక్‌గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్(18) జతగా ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను ఉరికించాడు. సిక్సర్లతో విరుచుకుపడిప ఇషాన్ పర్ ప్లేలో 51 రపరుగుల చేసింది. ఆ తర్వాతి ఓవర్ల రియాన్ పరాగ్ హెడ్‌ను బోల్తా కొట్టించగా.. హెన్రిచ్ క్లాసెన్ (40) అండతో ఇషాన్ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్లను ఔట్ చేసిన ఆనందంలో ఉన్న రాజస్థాన్ బౌలర్లను బెంబేలెత్తించారిద్దరూ.
ఇషాన్ కిషన్ (91)

క్లాస్ ఇన్నింగ్స్‌తో అర్ధ శతకం సాధించిన ఇషాన్ ఆర్చర్ వేసిన 13వ ఓవర్లో రెండు ఫోర్లతో స్కోర్ 140కి చేరింది. అదే ఊపులో సెంచరీ కొట్టేలా కనిపించిన ఇషాన్‌ను సందీప్ శర్మ రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. అనంతరం క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి(28), సలీల్ అరోరా(24 నాటౌట్)లు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. చివరి ఓవర్లో దేశ్‌పాండే తొలి ఐదు బంతులకు ఒకే ఫోర్ ఇచ్చినా.. ఆఖరి బంతిని సలీల్ స్టాండ్స్లోపి పంపాడు. దాంతో 220పైగా కొడుతుందనుకున్న సన్‌రైజర్స్ 216కే పరిమితమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

