PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
PM Narendra Modi : ఇటీవల ఆసియా క్రీడల్లో పతకాలతో మెరిసిన భారత బృందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) అభినందించారు. దేశం గర్వపడే ప్రదర్శన చేసిన క్రీడాకారులతో గురువారం భేటీ అయిన మోడీ 'మీరు 140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశార'ని అన్నారు.
PM Narendra Modi : ఇటీవల ఆసియా క్రీడల్లో పతకాలతో మెరిసిన భారత బృందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) అభినందించారు. దేశం గర్వపడే ప్రదర్శన చేసిన క్రీడాకారులతో గురువారం భేటీ అయిన మోడీ ‘మీరు 140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశార’ని అన్నారు. ఆసియాడ్‌లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన అథ్లెట్లు, క్రికెట్ టీమ్‌లను ప్రధాని ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో సన్మానించారు. ఈ సందర్భంగా భారత బృందం సతకాలు చేసిన జెర్సీని మోడీకి బహూకరించింది.
ఐచీ – నగోయ వేదికగా జరిగిన 18వ ఆసియా క్రీడల్లో పతకాలు కొల్లగొట్టిన భారత బృందాన్ని గురువారం ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు. గత ఎడిషన్‌లో మాదిరిగా ఈసారి సెంచరీ కొట్టకున్నా సరే దేశ ప్రజలంతా గర్వపడే ప్రదర్శన చేసినందుకు వారిని మోడీ అభినందించారు.
PM @narendramodi interacts with the participants of Asian Games 2026 https://t.co/CgEjBX67r7
— Ministry of Information and Broadcasting (@MIB_India) October 15, 2026
‘మీరు 140 కోట్ల భారతీయులు గర్వపడేలా చేశారు. పోడియం మీద త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేయడం మీరు సాధించిన పెద్ద విజయం. అందుకే.. ఈ విజయం మీది మాత్రమే కాదు దేశంలోని కోట్లాది మందికి చెందుతుంది. దేశ ప్రజలందరి తరఫున మిమ్మల్ని అభినందిస్తున్నా. 18వ ఆసియాడ్‌లో గెలుపొందిన 85 పతకాల్లో.. 38 మహిళా అథ్లెట్లు సాధించినవే. వీటిలో పదకొండు స్వర్ణాలు ఉండడం భారత్‌కు చాలా ప్రత్యేం. అద్భుత ప్రదర్శన చేసిన మహిళా అథ్లెట్లకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక్కడ హాకీ జట్లు రెండు ఉన్నాయి. హాకీలో పురుషుల, మహిళల జట్లు స్వర్ణాలు పట్టేశాయి.
Our Asian Games champions have made the Tricolour fly high! Their achievements show what passion, perseverance and belief can achieve. https://t.co/m3gOPecQCo
— Narendra Modi (@narendramodi) October 15, 2026
ముఖ్యంగా.. మహిళల జట్టు 41 ఏళ్ల తర్వాత ఆసియాడ్‌లో మొదటిసారి పసిడి పతకంతో చరిత్ర లిఖించింది’ అని ఆసియా క్రీడల బృందంతో భేటీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖా మంత్రి మన్సూఖ్ మాండవీయ, భారత కోచింగ్ బృందం, తదితరులు పాల్గొన్నారు. ఇటీవలే ముగిసిన ఆసియా క్రీడల్లో వందకు పదిహేను పతకాల దూరంలో ఆగిపోయిన భారత్.. నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

