HomeSportsPermanent Ban On Spitting Icc Changes Cricket Rules
ఉమ్మిపై శాశ్వత నిషేధం
క్రికెట్‌ను మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దేందుకు ఐసీసీ ఇటీవల మార్పులు చేస్తూ వస్తున్నది. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ ప్రతిపాదించిన కొత్త నిబంధనలను ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదించింది.
క్రికెట్ నిబంధనల్లో మార్పులు
దుబాయ్: క్రికెట్‌ను మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దేందుకు ఐసీసీ ఇటీవల మార్పులు చేస్తూ వస్తున్నది. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ ప్రతిపాదించిన కొత్త నిబంధనలను ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదించింది.
నాన్ స్ట్రైకింగ్‌లోని బ్యాటర్‌ను రనౌట్ చేయడాన్ని ‘అన్ ఫెయిర్‌ప్లే’ విభాగం నుంచి ‘రనౌట్’ విభాగానికి మార్చారు.
బంతికి మెరుపు తెచ్చేందుకు గతంలో బౌలర్లు ఉమ్మిని రాసేవారు. దానిని కరోనా నేపథ్యంలో నిషేధించగా.. ఇపుడు ఆ పద్ధతిని శాశ్వతం చేశారు.
ప్రస్తుతం టెస్టులు, వన్డేలలో కొత్త బ్యాటర్ తప్పని సరిగా రెండు నిమిషాల లోపు బ్యాటింగ్‌కు సిద్ధమవాలి. ఈ సమయం టీ20లలో 90 సెకండ్లుగా ఉంది.