బ్రసిలియా : బ్రెజిల్ దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే ఆసుపత్రిలో చేరాడు. కోలన్ ట్యూమర్ కారణంగా ఆసుపత్రిలో చేరాడని సాపోలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. గత సంవత్సర కాలం నుంచి ఆయన పెద్దపేగు కణితి సమస్యతో బాధపడుతున్నారు. త్వరలోనే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతాడని వైద్యబృందం ఆశాభావం వ్యక్తం చేశారు. పీలే ఇంతకు ముందు సెప్టెంబర్ 4న కణితికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆసుపత్రిలో నెల రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత డిశ్చార్జి అయిన అనంతరం ఇంట్లోనే ఉండి కీమోథెరపీ చేయించుకున్నారు. ప్రపంచంలోనే గొప్ప ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేరున్న పీలే.. బ్రెజిల్‌కు చెందిన మూడుసార్లు ఫుట్‌బాల్ ప్రపంచకప్ అందించాడు. పీలే ఆధ్వర్యంలో బ్రెజిల్ 1958, 1962, 1970లో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను సాధించింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్లో 77కుపైగా గోల్స్‌ను సాధించి, ఇప్పటికీ టాప్ 10 జాబితాలో ఉన్నాడు.