పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు తొలి ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జోస్ బట్లర్ (30) పెవిలియన్ చేరాడు. రబాడ వేసిన నాలుగో ఓవర్ చివరి బంతికి బట్లర్ అవుటయ్యాడు. రబాడ వేసిన వైడ్ యార్కర్‌ను లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన బట్లర్.. విఫలమయ్యాడు. దాంతో బ్యాటుకు తగిలి గాల్లోకి లేచిన బంతి షార్ట్ థర్డ్ మ్యాన్ ఫీల్డర్ వైపు వెళ్లింది. అక్కడే ఉన్న రాజపక్స కంఫర్టబుల్‌గా క్యాచ్ అందుకోవడంతో బట్లర్ నిరాశగా పెవిలియన్ చేరాడు.