లక్నో సూపర్ జెయింట్ మూడో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ క్వింటన్ డీకాక్ (46) అవుటైన తర్వాతి ఓవర్లోనే మరో ఆటగాడు దీపక్ హుడా (34) రనౌట్ అయ్యాడు. జానీ బెయిర్‌స్టో వేసిన డైరెక్ట్ త్రో అతన్ని వెనక్కు పంపింది. అర్షదీప్ వేసిన షార్ట్ బాల్‌ను పుల్ చేసి రన్ కోసం హుడా పరిగెత్తాడు. ఆ బంతిని పట్టుకున్న జానీ బెయిర్‌స్టో.. డీప్ స్క్వేర్ లెగ్ నుంచి నేరుగా వేసిన త్రో వికెట్లను కూల్చింది. దీంతో హుడా పెవిలియన్ చేరాడు.