PBKS vs LSG | తడబడిన లక్నో బ్యాటింగ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ తడబడింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కేఎల్ రాహుల్ (6) విఫలమవడంతో.. ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన బాధ్యత మరో ఓపెనర్ క్వింటన్ డీకాక్ (46), దీపక్ హుడా (34) మీద పడింది. వీళ్లిద్దరూ అనవసర షాట్లకు పోకుండా ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు.
అయితే పదమూడో ఓవర్లో సందీప్ శర్మ బౌలింగ్‌లో డీకాక్ అవుటవడంతో లక్నో బ్యాటింగ్ లైనప్ పతనం మొదలైంది. ఆ తర్వాతి ఓవర్లోనే దీపక్ హుడాను బెయిర్‌స్టో రనౌట్ చేశాడు. కృనాల్ పాండ్యా (7), ఆయుష్ బదోనీ (4), మార్కస్ స్టొయినిస్ (1), జేసన్ హోల్డర్ (11) నిరాశపరిచారు.
చివర్లో దుష్మంత చమీర (17) వరుసగా రెండు సిక్సర్లు బాదినా.. ఈ తర్వాతి బంతికే రబాడ బౌలింగ్‌లో చాహర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి లక్నో జట్టు 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో రబాడ 4, చాహర్ 2, సందీప్ శర్మ ఒక వికెట్ తీసుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

