చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన భానుక రాజపక్స (42) అవుటయ్యాడు. కెప్టెన్ మయాక్ (18) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అతను.. ధవన్ (74 నాటౌట్)తో కలిసి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాడు. బ్యాటింగ్ చేయడం కష్టంగా కనిపిస్తున్న పిచ్‌పై ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లారు.
చివరి ఐదు ఓవర్లలో వేగం పెంచే క్రమంలో రాజపక్స వికెట్ పారేసుకున్నాడు. డ్వేన్ బ్రావో వేసిన 18వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ సరిగా టైమింగ్ కుదరకపోవడంతో బంతి బాగా ఎత్తుగా లేచింది. ఎక్స్ట్రా కవర్లో ఫీల్డింగ్ చేస్తున్న దూబే క్యాచ్ అందుకోవడంతో రాజపక్స్ ఇన్నింగ్స్ ముగింపుకొచ్చింది.