RR vs RCB : గువాహటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ (63) అర్ధ శతకంతో మెరిశాడు. విరాట్ కోహ్లీ(32) రాణించినా.. రవి బిష్ణోయ్(2-32), బ్రిజేశ్ శర్మ(2-37) విజృంభణతో మిడిలార్డర్ కుప్పకూలింది. ఓవైపు వికెట్లు పడుతున్నా అటాకింగ్ గేమ్‌తో విరుచుకుపడిన పాటిదార్ భారీ స్కోర్‌కు బాటు వేశాడు. రొమారియో షెపర్డ్(22) దంచేయగా.. ఇంప్యాక్ట్ సబ్ వెంకటేశ్ అయ్యర్(29 నాటౌట్) చివరి ఓవర్లో 4, 6, 6 బాదడంతో ఆర్సీబీ 201 పరుగులు చేసింది.
వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో ఆర్సీబీకి శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే డేంజరస్ ఫిలిప్ సాల్ట్(0)ను జోఫ్రా ఆర్చర్(2-33) వెనక్కి పంపాడు. బౌండరీలతో రెచ్చిపోతతున్న దేవ్‌దత్ పడిక్కల్(14)ను హిట్మైర్ డైవింగ్ క్యాచ్‌తో పెవిలియన్ పంపగా.. రవి బిష్ణోయ్ ఓవర్లో షాట్‌కు యత్నించిన విరాట్ కోహ్లీ(32) క్లీన్‌బౌల్డయ్యాడు. అంతే..58కే మూడు వికెట్లు పడ్డాయి. ఆ దశలో కెప్టెన్ రజత్ పటిదార్(63), కృనాల్ పాండ్యా(1)తో భాగస్వామ్యం నిర్మించాలనుకున్నాడు.
Rajat Patidar is putting on a show in Guwahati 🫡
What a knock this is turning out to be for #RCB ❤️
Updates ▶️ https://t.co/X76bJjmq1j#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @RCBTweets pic.twitter.com/MnK1IjNrBy
— IndianPremierLeague (@IPL) April 10, 2026
బిగ్ వికెట్లు పడిన వేళ జట్టును ఆదుకోవాలనుకున్న కృనాల్ పాండ్యాను బిష్ణోయ్ డగౌట్ చేర్చాడు. అతడి ఓవర్లో బిగ్ షాట్ ఆడబోయి హిట్‌మైర్‌కు దొరికిపోయాడు. బిగ్ హిట్టర్ టిమ్ డేవిడ్ కూడా నేరుగా హిట్మైర్ చేతుల్లో చిక్కి ఔటవ్వగా.. బిష్ణోయ్ ఓవర్లో సిక్సర్‌తో రొమారియో షెపర్డ్(22) సిక్సర్‌తో బెంగళూరు స్కోర్ వంద దాటింది. బౌండరీలతో ప్రమాదకరంగా మారిన రొమారియో షెపర్డ్(22)ను జడేజా బోల్తా కొట్టించగా ఆర్సీబీ ఏడో వికెట్ పడింది.
అర్ధ శతకంతో రెచ్చిపోయిన పాటిదార్‌ను సందీప్ శర్మ ఔట్ చేశాక ఆర్సీబీ స్కోర్ వేగం తగ్గింది. అయితే.. సందీప్ శర్మ వేసిన 20వ ఓవర్లో ఇంప్యాక్ట్ సబ్ వెంకటేశ్ అయ్యర్(29 నాటౌట్) వరసగా 4, 6. 6 బాదడంతో బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.