Matheesha Pathirana | కోల్‌కతాకు గుడ్‌న్యూస్.. యార్కర్ కింగ్ వచ్చేస్తున్నాడు..!
Matheesha Pathirana : పంతొమ్మిదో సీజన్లో పరాజయా పరంపర కొనసాగిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)కు గుడ్‌న్యూస్. బోణీ కోసం నిరీక్షిస్తున్న కోల్‌కతాను గెలుపు తోవ తొక్కించేందుకు మథీశ పథిరన(Matheesha Pathirana) సిద్ధమవుతున్నాడు.
Matheesha Pathirana : పంతొమ్మిదో సీజన్లో పరాజయా పరంపర కొనసాగిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)కు గుడ్‌న్యూస్. బోణీ కోసం నిరీక్షిస్తున్న కోల్‌కతాను గెలుపు తోవ తొక్కించేందుకు మథీశ పథిరన(Matheesha Pathirana) సిద్ధమవుతున్నాడు. పొట్టి ప్రపంచకప్ గాయం నుంచి కోలుకున్న పథిరన శ్రీలంక బోర్డు కొత్తగా ప్రవేశపెట్టిన ఫిట్నెస్ పరీక్షలో పాసయ్యాడు. తద్వారా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అందుకున్న ఈ యార్కర్ కింగ్ త్వరలోనే కేకేఆర్ స్క్వాడ్‌లో కలువనున్నాడు.
మాజీ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ కష్టాలు తీరనున్నాయి. ప్రధాన పేసర్లు హర్షిత్ రానా, ఆకాశ్ దీప్‌లు దూరమవ్వడంతో భారీ స్కోర్లు సర్పించుకుంటున్న ఆ జట్టు రాత మార్చేందుకు పథిరన వస్తున్నాడు. ఫిట్నెస్ పరీక్షలో గట్టెక్కిన ఈ యువ పేసర్ ఒకటి రెండు రోజుల్లో కోల్‌కతా స్క్వాడ్‌లో చేరునున్నాడు. ఏప్రిల్ 14న చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌కు పథిరన అందుబాటులో ఉండే అవకాశముంది. గత సీజన్ వరకూ చెన్నైకి ఆడిన పథిరన ఈసారి ఆ జట్టుతో ప్రత్యర్థిగా తలపడనున్నాడు.
Good news for KKR fans!
Matheesha Pathirana has cleared the mandatory SLC fitness test and has been given the no-objection certificate to travel to India https://t.co/4CjTrjuJbI pic.twitter.com/UYT6FvVEj8
— ESPNcricinfo (@ESPNcricinfo) April 12, 2026
మూడింటా ఓటమి
పంతొమ్మిదో సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను దురదృష్టం వెంటాడుతోంది. ఇప్పటిరకూ ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒకటి రద్దవ్వగా.. మూడింటా ఓటమిపాలైన కేకేఆర్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ప్లే ఆఫ్స్ రేసుకు గట్టి పోటీ నెలకొన్న ఈ పరిస్థితుల్లో ఇకపై ప్రతి మ్యాచ్‌ను భారీ తేడాతో.. మంచి రన్‌రేటుతో గెలిస్తేనే అజింక్యా రహానే బృందం ముందంజ వేసే అవకాశముంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

