Paris Olympics : ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీలో ‘లాస్ట్ సప్పర్’ షో.. ఆ పేరడీపై తీవ్ర విమర్శలు
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ సంబరాల్లో కళాకారులు ప్రదర్శించిన లాస్ట్ సప్పర్ పేరడీపై విమర్శలు వస్తున్నాయి. భారీ టేబుల్ ముందు జీసెస్‌తో పాటు అతని 12 మంది శిష్యులు భోజనం చేసినట్లు ఉన్న డావిన్సీ ఫోటో ఆధారంగా .. ఓపెనింగ్ సెర్మనీలో డ్రాగ్ క్వీన్ కళాకారులు లాస్ట్ సప్పర్ పేరడీ చేశారు.
పారిస్: పారిస్ ఒలింపిక్స్(Paris Olympics) ప్రారంభోత్సవ సంబరాల్లో భాగంగా .. కళాకారులు ప్రదర్శించిన లాస్ట్ సప్పర్ పేరడీపై విమర్శలు వస్తున్నాయి. ఆన్లైన్లో ఆ ప్రదర్శనపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. భారీ టేబుల్ ముందు జీసెస్‌తో పాటు అతని 12 మంది శిష్యులు భోజనం చేసినట్లు ఉన్న డావిన్సీ ఫోటో ఆధారంగా .. ఓపెనింగ్ సెర్మనీలో డ్రాగ్ క్వీన్ కళాకారులు లాస్ట్ సప్పర్ పేరడీ చేశారు. క్రైస్తవ కమ్యూనిటీ ఈ పేరడీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీంట్లో 18 మంది కళాకారులు పాల్గొన్నారు. జీసెస్‌తో పాటు అతని శిష్యులు కూర్చిన భోజనం చేస్తున్నట్లుగానే.. ఆ స్టంట్‌లో ప్రదర్శన ఇచ్చారు. అయితే ఓ మహిళ తన తలకు భారీ వెండి కవచాన్ని ధరించి కనిపించింది. దీన్ని విమర్శకులు తప్పపడుతున్నారు. లాస్ట్ సప్పర్ షోలో ఓ చిన్న పిల్ల కూడా ఉన్నది. అయితే ఆ అమ్మాయిని ఎందుకు ప్రదర్శనలో ఉంచారని కూడా కొందరు విమర్శిస్తున్నారు.
లాస్ట్ సప్పర్ షోకు చెందిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇది క్యాథలిక్ క్రైస్తవులను అవమానించడమే అని సోషల్ మీడియా యూజర్లు ఆరోపిస్తున్నారు. హాస్యపూరితమైన రీతిలో ప్రజల్లో చైతన్యం కల్పించాలన్న ఉద్దేశంతోనే ఆ పర్ఫార్మెన్స్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 2.4 బిలియన్ల క్రైస్తవులను అవమానించినట్లే అని మరొకరు పేర్కొన్నారు. జీసెస్‌ను ఓ మహిళగా, అతని శిష్యులను ట్రాన్స్వెస్టీలుగా చిత్రీకరించారని, ఇది లాస్ట్ సప్పర్‌ను అగౌరవపరచడమే అని బ్రాడ్‌కాస్టర్ నియాల్ బాయ్‌లాన్ తెలిపారు.
Controversy erupts as the Paris Olympics’ Pride celebration features a Last Supper-themed event, sparking outrage among Christian communities worldwide. 🌈⛪️ #ParisOlympics #Pride #LastSupper #paris2024olympics pic.twitter.com/Pn1qxW2Rxt
— 3 Ps & A Pod (@3Ps_Pod) July 26, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

