Paris Olympics 2024 | ఒలింపిక్స్‌లో అదరగొట్టిన సింధు.. తొలి రౌండ్లో విజయం
Paris Olympics 2024 | భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics 2024) లో శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఘన విజయంతో ఆమె ఈ ఒలింపిక్స్ జర్నీని మొదలు పెట్టింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరుగుతున్న ఈ ఒలింపిక్ క్రీడల్లో తెలుగమ్మాయి సింధు తన ప్రత్యేకతను చాటి చెప్పింది.
Paris Olympics 2024 : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics 2024) లో శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఘన విజయంతో ఆమె ఈ ఒలింపిక్స్ జర్నీని మొదలుపెట్టింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరుగుతున్న ఈ ఒలింపిక్ క్రీడల్లో తెలుగమ్మాయి సింధు తన ప్రత్యేకతను చాటిచెప్పింది.
తొలి మ్యాచ్‌లో ఆమె మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి ఫతీమత్ నబాబా అబ్దుల్ రజాక్ (Fathimath Nabaaha Abdul Razzaq) పై సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రజాక్.. సింధుకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. సింధు కేవలం 29 నిమిషాల్లోనే వరుసగా రెండు సెట్లలో మాల్దీవ్స్ క్రీడాకారిణిని చిత్తుచేసింది. రెండు సెట్లలో 21-9, 21-6 తేడాతో సింధు గెలిచింది.
సింధు తన రెండో గ్రూప్ మ్యాచ్‌లో ఎస్తోనియా షట్లర్ క్రిస్టిన్ కూబాతో తలపడనుంది. జూలై 31న ఈ మ్యాచ్ జరగనుంది. కాగా సింధుకు ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇది మూడోసారి. ఆమె 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

