IND vs IRE | బెంబేలెత్తించిన పాండ్యా, అర్ష్‌దీప్.. ఐర్లాండ్ ఆలౌట్
IND vs IRE టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో భారత(Team India) పేసర్లు ప్రతాపం చూపించారు. న్యూయార్క్ స్టేడియంలో పట్టపగలే పసికూన ఐర్లాండ్(Ireland)బ్యాటర్లకు చుక్కలు చూపించారు.
IND vs IRE టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో భారత(Team India) పేసర్లు ప్రతాపం చూపించారు. న్యూయార్క్ స్టేడియంలో పట్టపగలే పసికూన ఐర్లాండ్(Ireland)బ్యాటర్లకు చుక్కలు చూపించారు. బౌన్స్, స్లో బాల్‌తో హార్దిక్ పాండ్యా(3/27), అర్ష్‌దీప్ సింగ్(2/34), జస్ప్రీత్ బుమ్రా(2/6)ల విజృంభించగా ఐరిష్ బ్యాటర్లు డగౌట్‌కు క్యూ కట్టారు. దాంతో ఐరిష్ జట్టు 96 పరుగులకే ఆలౌటయ్యింది. గెరాత్ డెలానీ(26), జోష్ లిటిల్(14)లు టాప్ స్కోరర్లుగా నిలిచాడు.
టాస్ గెలిచిన రోహిత్ ఐర్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అంతే.. బౌన్స్‌కు అనుకూలించిన పిచ్‌పై భారత యువ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తొలి బ్రేక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో డేంజరస్ పాల్ స్టిర్లింగ్(2)ను వెనక్కి పంపిన అతడు ఆఖరి బంతికి మరో ఓపెనర్ అండ్రూ బల్బిరినీ(2)ని బౌల్డ్ చేశాడు. దాంతో, 9 పరుగులకే ఐర్లాండ్ ఓపెనర్లు పెవిలియన్ చేరారు. ఆ తర్వాత బంతి అందుకున్న పాండ్యా రెండు వికెట్లతో ఐర్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. సిరాజ్, బుమ్రా సైతం తలొక వికెట్ తీయడంతో ఒకదశలో ఐర్లాండ్ 60 లోపై ఆలౌట్ అవుతుందనిపించింది.
డెలానీ ఒంటరి పోరాటం
యాభై పరుగులకే 8 వికెట్లు పడిన ఐర్లాండ్ పోరాడగలిగే స్కోర్ చేసిందంటే అందుకు కారణం గెరాత్ డెలానీ(26), జోష్ లిటిల్(14). వీళ్లిద్దరూ ధనాధన్ ఆడి తొమ్మిదో వికెట్‌కు 27 రన్స్ జోడించారు. యార్కర్‌తో విడదీసిన బుమ్రా రోహిత్ సేనకు రిలీఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన బెంజమిన్ వైట్(2) జతగా డెలానీ రెచ్చిపోయాడు. అర్ష్‌దీప్ వేసిన 16వ ఓవర్లో ఫోర్, సిక్స్, ఫోర్ బాది జట్టు స్కోర్ 90 దాటించాడు. అయితే.. ఆదే ఓవర్లో నో బాల్ తర్వాత రెండు రన్స్ తీసే క్రమంలో డెలానీ రనౌటయ్యాడు. దాంతో, 96 పరుగులకే ఐర్లాండ్ పరిమితమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లాంటి బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్ స్వల్ప లక్ష్యాన్ని ఎన్ని ఓవర్లలో ఛేదిస్తుందో చూడాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

