Pakistan Cricket: సారథులు మారినా తలరాత మారుతలె.. ఒక్క విజయం కోసం 76 రోజులుగా పాక్ ఎదురుచూపులు..
Pakistan Cricket: అంతర్జాతీయ క్రికెట్లో ఆ జట్టు ఆఖరిసారి గెలిచిన మ్యాచ్ ప్రపంచకప్‌లో నవంబర్ 04న.. న్యూజిలాండ్‌పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఆ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత పాక్ మళ్లీ ‘గెలుపు’ రుచి చూడలేదు.
Pakistan Cricket: అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఎప్పుడెలా ఆడుతుందో ఎవరికీ తెలియదు. బాబర్ ఆజమ్ సారథ్యంలో పొట్టి క్రికెట్‌తో పాటు స్వదేశంలో మూడు ఫార్మాట్లలోనూ విజయాలు సాధించిన ఆ జట్టు వన్డే వరల్డ్ కప్ తర్వాత అత్యంత చెత్త ప్రదర్శనలతో పరాభవాల బాట పట్టింది. వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌తో ఓడిన తర్వాత ఆ జట్టు ఫేట్ మారిపోయింది. మెన్ ఇన్ బ్లూతో ఓటమితో పాకిస్తాన్ అడపాదడపా విజయాలు రాణించినా ఆ టోర్నీలో గ్రూప్ స్టేజ్ నుంచే ఎగ్జిట్ అయిన ఆ జట్టు ఒక్క విజయం కోసం ఏకంగా 76 రోజుల నుంచి ఎదురుచూపులు చూస్తూనే ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో ఆ జట్టు ఆఖరిసారి గెలిచిన మ్యాచ్ ప్రపంచకప్‌లో నవంబర్ 04న.. న్యూజిలాండ్‌పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఆ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత పాక్ మళ్లీ ‘గెలుపు’ రుచి చూడలేదు. కొద్దిరోజుల క్రితమే ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మూడింట్లోనూ ఓడిపోయిన పాక్.. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లలోనూ ఓడింది.
76 రోజులుగా విజయం లేదు..
వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై గెలిచిన తర్వాత పాకిస్తాన్ 8 మ్యాచ్‌లు ఆడింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఓడిన పాక్.. ఆ తర్వాత కొద్దిరోజుల విరామం అనంతరం ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చింది. ఈ నెలన్నర గ్యాప్‌లో పాకిస్తాన్ క్రికెట్లో కెప్టెన్‌తో పాటు చాలా మార్పులు జరిగాయి. బాబర్‌ను తప్పించి టెస్టు క్రికెట్ కెప్టెన్‌గా షాన్ మసూద్‌ను నియమించిన ఆ జట్టు.. టీ20 బాధ్యతలను యువ పేసర్ షహీన్ షా అఫ్రిదికి అప్పగించింది. డిసెంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన పాక్.. అక్కడ మూడు టెస్టులలోనూ క్లీన్ స్వీప్‌ను మూటగట్టుకుంది. తాజాగా న్యూజిలాండ్‌తోనూ (0-4) పరాభవాల పరంపర కొనసాగించింది.
Pakistan in the last 8 matches in International cricket:
– Lost
– Lost
– Lost
– Lost
– Lost
– Lost
– Lost
– Lost pic.twitter.com/n7vt0BUMEW— Johns. (@CricCrazyJohns) January 19, 2024
బాబరే కాస్త బెటర్..!
బాబర్ సారథిగా ఉన్నప్పుడైనా అంతో ఇంతో రాణించిన పాక్.. ఇప్పుడు ఆ పోరాటపటిమను కూడా ప్రదర్శించడం లేదు. ఆస్ట్రేలియా టూర్లో బాబర్ పూర్తిస్థాయిలో విఫలమయ్యాడు. బ్యాటర్లలో ఒకరిద్దరు మినహా ఎవరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఆ దేశపు తురుపుముక్కగా భావించే అఫ్రిది కూడా ఆ సిరీస్‌లో తేలిపోయాడు. ఇక తాజాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లోనూ అదే కథ. టీ20లలో ఓపెనింగ్ స్థానాన్ని కోల్పోయిన బాబర్.. వన్ డౌన్లో రాణిస్తున్నా మిగిలిన బ్యాటర్లు విఫలమవుతుండటంతో ఆ జట్టు ఓటముల పాలవుతోంది. బౌలర్లలో హరీస్ రౌఫ్‌ను న్యూజిలాండ్ బౌలర్లు ఓ పద్ధతి ప్రకారం బాదుతున్నారు. అఫ్రిది ప్రభావమూ అంతంతమాత్రమే.
సమిష్టి వైఫల్యం..
ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి చూసి ఆ దేశ మాజీలతో పాటు అభిమానులు కూడా నివ్వెరపోతున్నారు. స్వింగ్ బౌలర్లకు పెట్టింది పేరైన పాకిస్తాన్.. విదేశాలపై ఇంత దారుణంగా విఫలమవుతుండటాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. బాబర్ హయాంలో అయినా జట్టులో కొంత పోరాటపటిమ ఉండేదని, ఇప్పుడు అది కూడా లేకుండా పోయిందని, ఒక్క విజయం కోసం సుమారు రెండున్నర నెలలుగా ఎదురుచూడటం పాక్ అభిమానులకు ఆగ్రహంతో పాటు జాలి కూడా తెప్పిస్తున్నది. గత 14 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆ జట్టుకు ఇది 12వ పరాభవం అంటేనే ఆ జట్టు ప్రదర్శన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరుస వైఫల్యాలతో ఆ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా ఆటగాళ్ల మధ్య సఖ్యత మిస్ అయిందని, జట్టులో కావాల్సినన్ని విభేదాలున్నాయని పాకిస్తాన్ మీడియా కోడై కూస్తోంది. ఇక న్యూజిలాండ్ టూర్లో పాకిస్తాన్.. ఈనెల 21న తుదిపోరులో తలపడాల్సి ఉంది. ఈ టూర్లో ఇదే ఆఖరి మ్యాచ్. ఈ పోరులో కూడా పాకిస్తాన్ ఓడిపోతే ఇంక ఆ జట్టు అభిమానుల ఆగ్రహావేశాలకు గురికాక తప్పదు…!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

