PCB | లాహోర్: గతేడాది భారత్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన తర్వాత ఆ జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న బాబర్.. నాలుగు నెలల స్వల్ప విరామం అనంతరం మళ్లీ నాయకుడిగా రీఎంట్రీ ఇచ్చాడు.
పాక్ పరిమిత ఓవర్ల జట్టుకు సారథిగా ఉన్న షహీన్అఫ్రిదిని ఒక్క సిరీస్‌కే పరిమితం చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించింది. రెండు నెలల్లో అమెరికా – వెస్టిండీస్‌లు సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన బాబర్ సారథ్యంలోనే బరిలోకి దిగనున్నట్టు పీసీబీ తెలిపింది.