Babar Azam | అంతర్జాతీయ T20ల్లో రోహిత్ శర్మను దాటేసిన బాబర్ ఆజమ్..
Babar Azam | అంతర్జాతీయ T20 మ్యాచ్‌లలో అత్యధిక పరుగుల చేసిన బ్యాటర్ల జాబితాలో.. పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్, బ్యాటర్ బాబర్ ఆజమ్.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్, బ్యాటర్ రోహిత్‌శర్మను దాటేశాడు. నిన్న ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 32 పరుగులు చేయడం ద్వారా బాబర్ ఈ ఘనత దక్కించుకున్నాడు
Babar Azam : అంతర్జాతీయ T20 మ్యాచ్‌లలో అత్యధిక పరుగుల చేసిన బ్యాటర్ల జాబితాలో.. పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్, బ్యాటర్ బాబర్ ఆజమ్.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్, బ్యాటర్ రోహిత్‌శర్మను దాటేశాడు. నిన్న ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 32 పరుగులు చేయడం ద్వారా బాబర్ ఈ ఘనత దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బాబర్ 26 బంతులను ఎదుర్కొని 32 పరుగులు చేశాడు. అయితే ఈ స్కోర్ పాకిస్థాన్ జట్టును గెలిపించలేకపోయినా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అతని స్థానాన్ని మెరుపర్చింది.
తాజాగా స్కోర్‌తో బాబర్ ఆజమ్ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ శర్మ మొత్తం 151 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లలో 143 ఇన్నింగ్స్ ఆడి 139.97 స్ట్రైక్‌రేట్‌తో 3,974 పరుగులు చేశాడు. ప్రస్తుతం జాబితాలో మూడో స్థానానికి దిగొచ్చాడు.
బాబర్ ఆజమ్ 3,987 పరుగులతో రోహిత్ శర్మను దాటేసి రెండో స్థానానికి చేరుకున్నాడు. బాబర్ మొత్తం 118 మ్యాచ్‌లలో 111 ఇన్నింగ్స్ ఆడి 129.91 స్ట్రైక్‌రేట్‌తో 3,987 రన్స్ చేశాడు. ఈ జాబితాలో భారత్‌కే చెందిన దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ అంతర్జాతీయ టీ20ల్లో 4,037 రన్స్ చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

