AUS vs PAK: బాక్సింగ్ టెస్టుకు పాక్ టీమ్ ప్రకటన.. ఫైనల్ లెవన్‌కు 12 మంది..!
AUS vs PAK: ఏ జట్టైనా ఫైనల్ లెవెన్‌లో 11 మందిని ప్రకటిస్తాయి. కానీ పాకిస్తాన్ మాత్రం 12 మందితో జట్టును ప్రకటించింది. సీనియర్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను తప్పించి మహ్మద్ రిజ్వాన్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది.
AUS vs PAK: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు మంగళవారం నుంచి ప్రఖ్యాత మెల్బోర్న్ స్టేడియం వేదికగా జరగాల్సి ఉన్న బాక్సింగ్ డే టెస్టు కోసం జట్టును ప్రకటించింది. అయితే ఏ జట్టైనా ఫైనల్ లెవెన్‌లో 11 మందిని ప్రకటిస్తాయి. కానీ పాకిస్తాన్ మాత్రం 12 మందితో జట్టును ప్రకటించి వీళ్లలో ఒకరు మ్యాచ్ ప్రారంభానికి ముందు తప్పుకుంటారని ట్విస్ట్ ఇచ్చింది. అంతేగాక సీనియర్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను తప్పించి మహ్మద్ రిజ్వాన్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది.
ఈ సిరీస్‌కు ముందే పాక్ ఏస్ స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ కాలి గాయం నుంచి తప్పుకోగా రెండో టెస్టుకు ముందు లెఫ్టార్మ్ స్పిన్నర్ నోమన్ అలీ కూడా గాయంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. దీంతో స్పిన్నర్‌గా సాజిద్ ఖాన్‌కు చోటు దక్కింది. ఇక పెర్త్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో భాగంగా అరంగేట్ర మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టిన ఖుర్రమ్ షాజాద్ కూడా గాయంతో రెండో టెస్టు నుంచి తప్పుకున్నాడు. హరీస్ రౌఫ్, నసీమ్ షాలు లేకపోవడంతో ఈ మ్యాచ్‌లో పేస్ బాధ్యతలు పూర్తిగా షహీన్ షా అఫ్రిది పైనే పడనున్నాయి. అతడికి తోడుగా అమిర్ జమాల్, హసన్ అలీ, మిర్ హమ్జాలు పేస్ భారాన్ని పంచుకోనున్నారు.
సర్ఫరాజ్‌ను తప్పించి మిర్ హమ్జాను 12 మంది సభ్యులలో చోటు కల్పించడంతో అతడికి తప్పకుండా ఛాన్స్ దక్కుతుందని తెలుస్తోంది. అయితే తుది జట్టు నుంచి ఎవర్ని తొలగిస్తారని మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. పిచ్ పేసర్లకు అనుకూలిస్తే పాక్ నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో వెళ్లాల్సి వస్తే మిడిలార్డర్ బ్యాటర్లలో ఎవరో ఒకరు తమ ప్లేస్‌ను త్యాగం చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో ఆడాలని చూస్తే మాత్రం.. హసన్ అలీ, మిర్ హమ్జాలలో ఎవరో ఒకరికే ఛాన్స్ దక్కొచ్చు.
Pakistan announce 12-man squad for second Test 🏏
The final XI will be named tomorrow.#AUSvPAK pic.twitter.com/hZsky4cPcN
— Pakistan Cricket (@TheRealPCB) December 25, 2023
పాకిస్తాన్ జట్టు: ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజమ్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సల్మాన్ అలీ అఘా, షహీన్ షా అఫ్రిది (వైస్ కెప్టెన్), హసన్ అలీ, మిర్ హమ్జా, అమిర్ జమాల్, సాజిద్ ఖాన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

