Shahenshah Afridi | ఈ పాక్ స్టీడ్స్టర్ లవ్‌స్టోరీ అదరహో.. పెళ్లికి ముందే ఆమెపై మనసు పారేసుకున్నాడు
Shahenshah Afridi : షాహిన్షా అఫ్రీదీ.. పాకిస్థాన్ తురుపుముక్క! అనతికాలంలోనే ప్రపంచంలోనే ప్రమాదకర బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్. తన పదునైన స్వింగ్‌తో బ్యాటర్లను బోల్తా కొట్టించే ఈ ఆరడుగుల బుల్లెట్‌కు అదిరిపోయే ప్రేమకథ ఉంది. పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రీదీ(Shahid Afridi) కూతురు...
Shahenshah Afridi : షాహిన్షా అఫ్రీదీ.. పాకిస్థాన్ తురుపుముక్క! అనతికాలంలోనే ప్రపంచంలోనే ప్రమాదకర బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్. తన పదునైన స్వింగ్‌తో బ్యాటర్లను బోల్తా కొట్టించే ఈ ఆరడుగుల బుల్లెట్‌కు అదిరిపోయే ప్రేమకథ ఉంది. పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రీదీ(Shahid Afridi) కూతురు అన్ష అఫ్రీదీ(Ansha Afridi)ను ప్రేమించి పెండ్లి చేసుకున్న షాహిన్ షా తన లవ్‌స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. షాహిద్ అఫ్రీదీతో తమ కుటుంబానికి ఎన్నో రోజుల నుంచి మంచి పరిచయలు ఉన్నాయన్న ఈ యువ క్రికెటర్. అన్ష వ్యక్తిగత ఇష్టాల గురించి సిగ్గుపడుతూ వివరించాడు.
‘లాలా (షాహిద్ అఫ్రిదీ ముద్దుపేరు), మా అన్న మంచి స్నేహితులు. ఒకరంటే ఒకరికి అభిమానం. ఎన్నో ఏండ్ల నుంచి మా ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఉన్నాయి. ఒకరి ఇంటికి ఒకరం తరుచూ వెళ్తుంటాం కూడా. అలా మా ఇంటికి అన్ష రావడం, నేను వాళ్ల ఇంటికి వెళ్లడం మా ప్రేమకు పునాది వేసింది. ఒక రోజు నా మనసులో ఉన్న మాటను అమ్మతో పంచుకున్నాను.
ఇరు కుటుంబాల పెద్దలు కూడా ఒప్పుకోవడంతో ఇద్దరం ఈ ఏడాది ప్రారంభంలో పెండ్లితో ఒక్కటయ్యాం’ అని షాషీన్ ఆఫ్రీది(Shaheen Afridi) తెలిపాడు. అంతేకాదు అన్ష చాలా మంచి అమ్మాయని, కుటుంబమంటే ప్రాణమిస్తుందని చెప్పుకొచ్చాడు.
షాహిన్షా అఫ్రీదీ, అన్ష

ఆమెలో నచ్చే విషయం
‘స్మార్ట్ ఫోన్లు, సోషల్‌మీడియా వాడకం విపరీతంగా ఉన్న ప్రస్తుత కాలంలో అన్ష అందరితో కలుపుగోలుగా ఉంటుంది. తనలో అది నాకు బాగా నచ్చుతుంది. క్రికెట్ విషయానికొస్తే నా బౌలింగ్‌ను అన్ష బాగా ఇష్టపడుతుంది. నా భార్య అన్ని రకాల వంటకాలు తింటుంది. అయితే.. మిగిలిన వంటకాల కంటే బిర్యానీ(Biryani)ని బాగా ఎంజాయ్ చేస్తూ తింటుంది’ అని షాహిన్ షా చెప్పాడు.
జట్టులో కీలక బౌలర్
2018లో పాకిస్థాన్ తరఫున అరంగేట్రం చేసిన షాహిన్ షా.. జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగాడు. వేగానికి స్వింగ్ జోడిస్తూ బ్యాటర్ల పాలిట సింహస్వప్నంలా నిలుస్తున్నాడు. 22 ఏండ్ల వయసులోనే షాహిన్ షా 25 టెస్టులు, 32 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. ఇందులో టెస్టుల్లో 99 వికెట్లు, వన్డేల్లో 62 వికెట్లు, టీ20ల్లో 58 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు పాకిస్థాన్ సూపర్ లీగ్‌లోనూ లాహోర్ క్యాలెండర్స్(Lahore Qalandars) కెప్టెన్‌గా సత్తా చాటుతున్నాడు.
ఇవి కూడా చదవండి
Ravindra Jadeja | రాక్‌స్టార్ రవీంద్ర జడేజా.. మైదానంలో జడ్డూ స్టైలిష్ లుక్స్ చూశారా..?
Team India – South Africa Tour | భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ఖరారు.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

