Womens T20 World Cup | కెప్టెన్‌గా ఫాతిమా సనా.. ఐదుగురికి తొలిసారి ప్రపంచకప్ ఛాన్స్..!
Womens T20 World Cup : పదో సీజన్ మహిళల పొట్టి వరల్డ్‌కప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించింది. ఫాతిమా సనా (Fatima Sana) కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని సెలెక్టర్లు ఎంపిక చేశారు.
Womens T20 World Cup : పదో సీజన్ మహిళల పొట్టి వరల్డ్‌కప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించింది. ముక్కోణపు సిరీస్‌ను, ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ఫాతిమా సనా (Fatima Sana) కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని సెలెక్టర్లు ఎంపిక చేశారు. సీనియర్లతో పాటు ప్రతిభావంతులైన జూనియర్లకు ప్రాధాన్యమిచ్చారు. అంతేకాదు రిజర్వ్ ప్లేయర్లుగా ఏకంగా ఆరుగురిని పాక్ బోర్డు తీసుకుంది.
వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ను నడిపించిన ఫాతిమా సనా పొట్టి కప్‌లోనూ కెప్టెన్‌గా ఎంపికైంది. సీనియర్లు మునీబా అలీ, అలియా రియాజ్, సదియా ఇక్బాల్, డయానా బైగ్, తస్మియా రుబబ్, తుబ హసన్‌లకు స్క్వాడ్‌లో చోటు దక్కింది. అండర్ -19 క్రికెట్లో అదరగొట్టిన ఇమన్ ఫాతిమా, నటాలియా పర్వేజ్, రమీన్ షమీమ్, సైరా జుబీన్లు మొదటిసారి ప్రపంచకప్ ఆడబోతున్నారు. ఈ పదిహేను మంది పోను.. ఆరుగురు రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు.
Fatima Sana will lead Pakistan for the second successive T20 World Cup pic.twitter.com/BGMS0fHv5X
— ESPNcricinfo (@ESPNcricinfo) May 16, 2026
పాకిస్థాన్ స్క్వాడ్ : ఫాతిమా సనా(కెప్టెన్), అలియా రియాజ్, అయేషా జఫర్, డయానా బైగ్, ఎమన్ ఫాతిమా, గుల్ ఫెరోజా, ఇరామ్ జవేద్, మునీబా అలీ(వికెట్ కీపర్), నష్రా సంధు, నటాలియా పర్వేజ్, రమీన్ షమీమ్, సడియా ఇక్బాల్, సైరా జబీన్, తస్మియా రుబబ, తుబ హసన్.
రిజర్వ్ ప్లేయర్లు – అంబర్ కైనత్, మొమినా రియాసత్, సడాఫ్ షమాస్, సిడ్రా అమిన్, సైయదా అరూబ్, ఉమే హనీ.
జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా టీ20 వరల్డ్‌కప్ మొదలవ్వనుంది. అంతకంటే ముందు ఐర్లాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్ ముక్కోణపు సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ మూడు జట్ల మధ్య డబ్లిన్‌లో మే 28 నుంచి జూన్ 4 వ తేదీ ఈ సిరీస్ జరుగనుంది.

ప్రపంచకప్ లీగ్ దశ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ జూన్ 14న భారత జట్టును ఢీకొట్టనుంది. జూన్ 17న దక్షిణాఫ్రికాతో, జూన్ 20 వ తేదీన బంగ్లాదేశ్‌తో, జూన్ 23న ఆస్ట్రేలియా, జూన్ 27వ తేదీన నెదర్లాండ్స్‌తో పాక్ తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

