SRH vs PBKS : ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రెండో ఓటమి ఎదురైంది. బ్యాటర్లు మెరిసినా.. బౌలర్ల వైఫల్యం హైదరాబాద్ జట్టును ముంచింది. ముల్లన్‌పూర్‌లో ఆరెంజ్ ఆర్మీ నిర్దేశించిన 220 పరుగలు ఛేదనలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. పోటా పోటీగా బౌండరీలు బాదిన ప్రియాన్ష్ ఆర్య(57), ప్రభ్‌సిమ్రన్ సింగ్(51) లక్ష్యాన్ని కరిగించగా.. శివాంగ్ కుమార్(3-33) వరుస వికెట్లతో ఆశలు రేపాడు. కానీ, నేనున్నాగా అంటూ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన శ్రేయాస్ అయ్యర్(69 నాటౌట్) మరో ఓవర్ ఉండగానే పంజాబ్‌ను గెలిపించాడు.
భారీ స్కోర్ కొట్టినా సరే పసలేని బౌలింగ్ కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వరసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. ముల్లన్‌పూర్‌లో అభిషేక్ శర్మ(74 28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసంతో పంజాబ్ కింగ్స్‌కు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఆరెంజ్ ఆర్మీ.. పవర్ ప్లేలోనే దండిగా రన్స్ ఇచ్చుకుంది.
𝗦𝗵𝗶𝘃𝗮𝗻𝗴 𝗦𝗵𝗶𝗻𝗲𝘀 ✨
🎥 The youngster keeps #SRH in the hunt with crucial strikes ☝️☝️
Updates ▶️ https://t.co/DUNkQi9YaV#TATAIPL | #KhelBindaas | #PBKSvSRH pic.twitter.com/S68rQmlUki
— IndianPremierLeague (@IPL) April 11, 2026
ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్(51), ప్రియాన్ష్ ఆర్య(57)లు ప్రతి బంతికి ఫోర్, సిక్స్ అన్నట్టుగా చెలరేగడంతో హైదరాబాద్ బౌలర్లు చేష్టులుడిగిపోయారు. ఎట్టకేలకు ఈ ప్రమాదకరమైన ద్వయాన్ని శివాంగ్ కుమార్(2-17) విడదీశాడు. 16 బంతుల్లోనే అర్ధ శతకం బాదేసిన ప్రియాన్ష్‌ను బౌండరీ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. దాంతో.. 99 వద్ద పంజాబ్ తొలి వికెట్ పడింది.
Oozing style and confidence 😎
Captain Shreyas Iyer took @PunjabKingsIPL towards victory with such delightful shots 🙌
Scorecard ▶️ https://t.co/DUNkQi9YaV#TATAIPL | #KhelBindaas | #PBKSvSRH | @ShreyasIyer15 pic.twitter.com/zDeejeklbm
— IndianPremierLeague (@IPL) April 11, 2026
కాసేపటికే శివాంగ్ ఓవర్లోనే మిడాఫ్‌లో సిక్సర్‌తో అర్ధ శతకం సాధించిన ప్రభ్‌సిమ్రన్ బౌండరీ వద్ద క్లాసెన్ చేతికి దొరికాడు. దాంతో.. 117 వద్ద రెండో వికెట్ కోల్పోయింది పంజాబ్. డేంజరస్ కొన్నొల్లి(11)ని సైతం ఔట్ చేసిన శివాంగ్ మ్యాచ్‌ను హైదరాబాద్ వైపు తిప్పాడు. కానీ, హర్షల్ పటేల్ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్(69 నాటౌట్) వరసగా 6, 4, 6తో పంజాబ్‌ను పోటీలోకి తెచ్చాడు. నేహల్ వధేరా(14) .. ఇషాన్ మలింగను సైతం ఉతికేసిన అయ్యర్ ..4, 6తో సన్‌రైజర్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. అర్ధ శతకంతో విరుచుకుపడిన అయ్యర్.. అభిషేక్ వేసిన 19వ ఓవర్లో బౌండరీతో పంజాబ్‌కు 6 వికెట్ల విజయాన్ని కట్టబెట్టాడు.
ఐపీఎల్ రికార్డ్ బ్రేకర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఓపెనర్లు అభిషేక్ శర్మ(74), ట్రావిస్ హెడ్(38) విధ్వంసక బ్యాటింగ్‌తో విరుచుకుపడినా.. మిడిలార్డర్ తడబాటుతో భారీ స్కోర్ చేయలేకపోయింది.

అభిషేక్, హెడ్ మెరుపులతో 250 అలవోకగా కొట్టేలా కనిపించిన సన్‌రైజర్స్‌ను పంజాబ్ కింగ్స్ పేసర్ శశాంక్ సింగ్(2-50) దెబ్బకొట్టాడు. ఆఖర్లో హెన్రిచ్ క్లాసెన్(39) దంచేసినా.. మిగతా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో హైదరాబాద్‌ను 219కే కట్టడి చేసింది పంజాబ్.