IND vs BAN | దారికొచ్చిన భారత బౌలర్లు.. 4 వికెట్లు కోల్పోయిన బంగ్లా..
IND vs BAN | వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో పూణే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత గాడితప్పిన భారత బౌలర్లు తర్వాత లైన్ దొరకబుచ్చుకున్నారు.
IND vs BAN | వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో పూణే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత గాడితప్పిన భారత బౌలర్లు తర్వాత లైన్ దొరకబుచ్చుకున్నారు. తొలి పవర్ ప్లే (1-15 ఓవర్లు) లో పేసర్లు ధారాళంగా పరుగులివ్వడంతో స్సిన్నర్లు రవంగ ప్రవేశం చేసి బంగ్లా దూకుడుకు అడ్డుకట్ట వేశారు. ఓపెనర్లు తాంజిద్ హసన్ (43 బంతుల్లో 51, 5 ఫోర్లు,3 సిక్సర్లు), లిటన్ దాస్‌లు అర్థ సెంచరీలతో బంగ్లాదేశ్‌కు శుభారంభాన్ని అందించారు. 27 ఓవర్లు ముగిసేసరికి బంగ్లా 4 కీలక వికెట్లను కోల్పోయి 138 పరుగులు చేసింది.
పూణే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఐదు ఓవర్లలో నెమ్మదిగానే ఆడింది. బుమ్రా, సిరాజ్‌లు కట్టడి చేయడంతో మొదటి ఐదు ఓవర్లలో బంగ్లా.. పది పరుగులు మాత్రమే చేయగలిగింది. కానీ సిరాజ్ వేసిన ఆరో ఓవర్లో రెండు బౌండరీలు బాదిన లిటన్ దాస్.. బంగ్లా ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. సిరాజ్ తన తర్వాతి ఓవర్లో కూడా మరో రెండు బౌండరీలు సమర్పించుకున్నాడు.
సిరాజ్‌ను పక్కనబెట్టిన రోహిత్.. హార్ధిక్ పాండ్యాకు బంతినిచ్చాడు. కానీ అతడిదీ అదే వరస. హార్ధిక్ వేసిన ఎనిమిదో ఓవర్లో లిటన్ దాస్ రెండు బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదాడు. దాస్ కొట్టిన మూడో బంతిని ఆపబోయి హార్ధిక్ కాలు బెనకడంతో అతడు పెవిలియన్ చేరాడు. ఆ ఓవర్‌ను కోహ్లీ పూర్తి చేయడం గమనార్హం. ఇక శార్దూల్ ఠాకూర్ వేసిన తొమ్మిదో ఓవర్లో తాంజిద్ హసన్.. ఫోర్, రెండు సిక్సర్లు బాదాడు. తొలి ఐదు ఓవర్లలో పది పరుగులే చేసిన బంగ్లా ఓపెనర్లు.. తర్వాత ఐదు ఓవర్లలో ఏకంగా 53 పరుగులు రాబట్టారు.
కానీ స్పిన్నర్ల రంగప్రవేశంతో బంగ్లా దూకుడు కాస్త తగ్గింది. ఠాకూర్ వేసిన 13వ ఓవర్ ఐదో బంతికి సింగిల్ తీసి అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న తాంజిద్.. కుల్దీప్ వేసిన మరుసటి ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో బంగ్లా తొలి వికెట్‌ను కోల్పోయింది. వన్డే వరల్డ్ కప్‌లో బంగ్లాకు ఇదే హయ్యస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కావడం గమనార్హం. బంగ్లాదేశ్ రెగ్యులర్ సారథి షకిబ్ అల్ హసన్ గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న నజ్ముల్ హోసేన్ శాంతో కూడా క్రీజులో నిలవలేకపోయాడు. జడేజా వేసిన 19వ ఓవర్ చివరి బంతికి శాంతో కూడా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కుల్దీప్ వేసిన 20వ ఓవర్ ఐదో బంతికి సింగిల్ తీసి అర్థ సెంచరీ సాధించాడు. దాస్‌కు వన్డేలలో భారత్ పై ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఇక శాంతో స్థానంలో వచ్చిన మెహిది హసన్ మిరాజ్ కూడా విఫలమయ్యాడు. రెండో స్పెల్‌కు వచ్చిన సిరాజ్.. 13 బంతులాడి మూడు పరుగులే చేసిన సిరాజ్‌ను పెవిలియన్‌కు పంపాడు. నిలకడగా ఆడుతున్న లిటన్ దాస్.. జడేజా వేసిన 27వ ఓవర్లో నాలుగో బంతిని శుభ్‌మన్ గిల్‌కు ఇచ్చి నిష్క్రమించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

