ODI World Cup-2023 | కేవలం రెండు బంతుల్లోనే 21 పరుగులు చేసిన ఆస్ట్రేలియా..!
ODI World Cup-2023 | వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు కేవలం రెండు లీగల్ బంతుల్లోనే 21 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ వేసిన తన రెండో ఓవర్లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు కేవలం రెండు లీగల్ బంతుల్లోనే 21 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ వేసిన తన రెండో ఓవర్లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. హెన్రీ వేసిన రెండో ఓవర్ తొలి లీగల్ బంతిని ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ సిక్సర్‌గా మలిచాడు.
తర్వాత హెన్రీ నోబాల్ వేశాడు. బ్యాటర్లు ఒక పరుగు కూడా చేశారు. బాల్ కౌంట్ కాకుండానే రెండు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత బంతిని కూడా హెన్రీ నోబాల్‌గా వేశాడు. ఆ బంతిని ట్రావిస్ హెడ్ సిక్సర్‌గా మలిచాడు. దాంతో బాల్ లెక్కలోకి రాకుండానే మరో 7 పరుగులు వచ్చాయి. అప్పటికే సింగిల్ లీగల్ డెలివరీకి 15 పరుగులు వచ్చినట్లయ్యింది. ఆ తర్వాత హెన్రీ లీగల్ బాల్ వేసినప్పటికీ హెడ్ మరో సిక్సర్ బాదాడు. దాంతో కేవలం రెండు లీగల్ బంతుల్లో ఆస్ట్రేలియా 21 పరుగులు రాబట్టింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

