అబుధాబి: ఆరంభంలోనే కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన న్యూజిల్యాండ్ జట్టును వికెట్ కీపర్ డెవాన్ కాన్వే (26 నాటౌట్), ఓపెనర్ డారియల్ మిచెల్ (22 నాటౌట్) ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడిన వీళ్లు పవర్ ప్లే ముగిసిన తర్వాత భారీ షాట్లకు పోకుండా ఎక్కువగా సింగిల్స్, డబుల్స్కే ప్రాధాన్యతనిచ్చారు.
ఈ క్రమంలోనే జట్టు స్కోరు 50 దాటింది. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతుండటంతో 10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిల్యాండ్ జట్టు 58/2 తో నిలిచింది.