అబుధాబి: చావో రేవో అనే మ్యాచ్లో ఆరంభంలో తడబడిన న్యూజిల్యాండ్ అనూహ్యంగా పుంజుకుంది. ఆరంభంలోనే మార్టిన్ గప్తిల్ (4), కేన్ విలియమ్సన్ (5) వికెట్లు కోల్పోయిన ఆ జట్టును డెవాన్ కాన్వే (44), డారియల్ మిచెల్ (53 నాటౌట్) ఆదుకున్నారు. రెండు కీలక వికెట్లు కోల్పోయిన తర్వాత మరో వికెట్ పడకుండా వీరిద్దరూ జాగ్రత్త పడ్డారు. అయితే వేగం పెంచే క్రమంలో కాన్వే అవుటయ్యాడు.
ఆ తర్వాత కాసేపటికే గ్లెన్ ఫిలిప్స్ (2) కూడా అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన జేమ్స్ నీషమ్ (11 బంతుల్లో 27) బౌండరీలతో విరుచుపడటంతో ఆ జట్టు విజయానికి చేరువైంది. కానీ 18వ ఓవర్ చివరి బంతికి అదిల్ రషీద్ బౌలింగ్లో అతను అవుటయ్యాడు. దీంతో 18 ఓవర్లకు కివీస్ 147/5 స్కోరుతో నిలిచింది.