NZ vs BAN | బంగ్లాపై కివీస్ ఘనవిజయం.. సిరీస్ సమం
NZ vs BAN | కివీ పేసర్ల ధాటికి బంగ్లా బ్యాటర్లు వణికిపోయారు. రెండు ఇన్నింగ్సులు బ్యాటింగ్ చేసి కూడా న్యూజిల్యాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును సాధించలేకపోయారు. దీంతో బంగ్లాపై కివీస్ జట్టు ఇన్నింగ్స్ 117 పరుగుల

కివీ పేసర్ల ధాటికి బంగ్లా బ్యాటర్లు వణికిపోయారు. రెండు ఇన్నింగ్సులు బ్యాటింగ్ చేసి కూడా న్యూజిల్యాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును సాధించలేకపోయారు. దీంతో బంగ్లాపై కివీస్ జట్టు ఇన్నింగ్స్ 117 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
వరల్డ్ టెస్టు ఛాంపియన్ జట్టును తొలి టెస్టులో అనూహ్యంగా ఓడించిన బంగ్లా.. రెండో టెస్టులో పూర్తిగా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. కివీ కెప్టెన్ టామ్ లాథమ్ (252), డెవాన్ కాన్వే (109, విల్ యంగ్ (54), టామ్ బ్లండెల్ (57), రాస్ టేలర్ (28) రాణించడంతో న్యూజిల్యాండ్ జట్టు 521/6తో పటిష్టమైన స్థితిలో నిలిచింది.
ఈ సమయంలో కెప్టెన్ లాథమ్..ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. ట్రెంట్ బౌల్ట్, కైల్ జేమీసన్, టిమ్ సౌథీ నిప్పులు చెరగడంతో బంగ్లా బ్యాటర్లు వణికిపోయారు. 126 పరుగులకే బంగ్లాదేశ్ చాపచుట్టేసింది. దీంతో ఫాలోఆన్‌లో పడిన బంగ్లా.. రెండో ఇన్నింగ్స్‌లో లిటాన్ దాస్ (102) పోరాడటంతో 278 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

ఈ విజయంతో బంగ్లా-న్యూజిల్యాండ్ రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. ఈ టెస్టుతో కివీస్ సీనియర్ బ్యాటర్ రాస్ టేలర్ టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడు. తన చివరి మ్యాచ్‌లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయని టేలర్.. బౌలింగ్ చేసి బంగ్లా ఇన్నింగ్స్ చివరి వికెట్ తీశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

