NZ vs AUS | చిత్తుగా ఓడిన ఆసీస్.. 89 పరుగుల తేడాతో నెగ్గిన కివీస్
NZ vs AUS | టీ20 ప్రపంచకప్ సూపర్-12 విభాగంలో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా చిత్తుగా ఓడింది. గతేడాది పొట్టి ప్రపంచకప్ ఫైనల్లో తలబడిన ఆసీస్, న్యూజిల్యాండ్ జట్ల
టీ20 ప్రపంచకప్ సూపర్-12 విభాగంలో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా చిత్తుగా ఓడింది. గతేడాది పొట్టి ప్రపంచకప్ ఫైనల్లో తలబడిన ఆసీస్, న్యూజిల్యాండ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు కివీస్ ఓపెనర్లు డెవాన్ కాన్వే (92 నాటౌట్), ఫిన్ అలెన్ (16 బంతుల్లో 42) గట్టి షాకిచ్చారు.
కేన్ విలియమ్సన్ (23), గ్లెన్ ఫిలిప్స్ (12) ఫర్వాలేదనిపించగా.. చివర్లో జేమ్స్ నీషమ్ (13 బంతుల్లో 26 నాటౌట్) కూడా రాణించాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు చేసింది. టీ20 ప్రపంచకప్‌లో న్యూజిల్యాండ్ చేసిన అత్యంత భారీ స్కోరు ఇదే కావడం గమనార్హం. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ బ్యాటర్లను కివీస్ బౌలర్లు వణికించారు.
దీంతో కంగారు పడిపోయిన కంగారూలు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (28) టాప్ స్కోరర్ అంటేనే వాళ్ల ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (5), ఆరోన్ ఫించ్ (13), మిచెల్ మార్ష్ (16), మార్కస్ స్టొయినిస్ (7), టిమ్ డేవిడ్ (11), మాథ్యూ వేడ్ (2), మిచెల్ స్టార్క్ (4), ఆడమ్ జంపా (0), జోష్ హాజిల్‌వుడ్ (1 నాటౌట్) పరుగులు చేశారు.
చివర్లో ప్యాట్ కమిన్స్ (21) జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో చివరి వికెట్‌గా మైదానం వీడాడు. దీంతో ఆసీస్ జట్టు 17.1 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ చెరో 3 వికెట్లతో చెలరేగగా.. బౌల్ట్ 2 వికెట్లు తీసుకున్నాడు. లోకీ ఫెర్గూసన్, ఐష్ సోధి చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

