న్యూజిల్యాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు ఘోర పరాజయం దిశగా సాగుతోంది. అంతకుముందు డెవాన్ కాన్వే (92 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో కివీస్ జట్టు 200 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ఆసీస్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
చివరకు గెలిపిస్తారని అనుకున్న మాథ్యూ వేడ్ (2), మ్యాక్స్వెల్ (28) కూడా పెవిలియన్ చేరారు. ఫెర్గూసన్ వేసిన 13వ ఓవర్లో కీపర్ కాన్వేకు క్యాచ్ ఇచ్చిన వేడ్ మైదానం వీడాడు. ఆ తర్వాతి ఓవర్లోనే సోధి వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన మ్యాక్స్వెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆ జట్టు 14 ఓవర్లు ముగిసేసరికి 91/7 స్కోరుతో నిలిచింది.