జొకో @24
ప్రస్తుత తరంలో తనకు తిరుగులేదని నొవాక్ జొకోవిచ్ మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి అగ్రస్థానంలో ఉన్న జొకో.. తాజాగా మరో ట్రోఫీతో గ్రాండ్‌స్లామ్స్ సంఖ్యను 24కు పెంచుకున్నాడు. యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6-3, 7-6 (7/5), 6-3తో మూడో సీడ్ డానియల్ మెద్వెదెవ్పై విజయం సాధించాడు.
- యూఎస్ ఓపెన్ కైవసం
- ఫైనల్లో మెద్వెదెవ్ చిత్తు
ఫెదరర్, నాదల్ వంటి దిగ్గజ ఆటగాళ్లనే అలవోకగా ఓడించిన సెర్బియా వీరుడు జొకోవిచ్‌కు మెద్వెదెవ్ ఎదురు నిలువలేక పోయాడు. అల్కరాజ్పై అద్భుత విజయంతో ఫైనల్‌కు దూసుకొచ్చిన మెద్వెదెవ్.. తుదిపోరులో జొకోకు కనీస ప్రతిఘటన ఇవ్వకుండానే చేతులెత్తేశాడు. యూఎస్ ఓపెన్ విజయంతో జొకో..అత్యధిక (24) గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన మార్గారెట్ కోర్ట్ సరసన నిలిచాడు.
ఈ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. 24 గ్రాండ్‌స్లామ్ టైటి ల్స్ గెలుస్తానని కలలో కూడా ఊహించలేదు. ఇది నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది. గత రెండు మూడేండ్ల నుంచే దీని గురించి ఆలోచిస్తున్నా. కండ్ల ముందు అవకాశం కనిపిస్తుండటంతో ఎందుకు సాధించకూడదని పట్టుబట్టి ఇక్కడి వరకు వచ్చా.
– జొకోవిచ్
న్యూయార్క్: ప్రస్తుత తరంలో తనకు తిరుగులేదని నొవాక్ జొకోవిచ్ మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి అగ్రస్థానంలో ఉన్న జొకో.. తాజాగా మరో ట్రోఫీతో గ్రాండ్‌స్లామ్స్ సంఖ్యను 24కు పెంచుకున్నాడు. యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6-3, 7-6 (7/5), 6-3తో మూడో సీడ్ డానియల్ మెద్వెదెవ్పై విజయం సాధించాడు. మూడు గంటలకు పైగా సాగిన పోరులో జొకోవిచ్ వరుస సెట్లలో మెద్వెదెవ్‌ను చిత్తుచేశాడు.
మ్యాచ్ మొత్తంలో 4 ఏస్‌లు కొట్టిన జొకో.. 38 విన్నర్లు సంధించగా.. 32 విన్నర్లకే పరిమితమైన మెద్వెదెవ్ 39 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. రెండో సెట్లో ఇరువురు ఆటగాళ్లు కొదమ సింహాల్లో పోరాడటంతో ఫలితం తేలేందుకు ఏకంగా గంటా 44 నిమిషాల సమయం పట్టడం గమనార్హం. నిరుడు కోవిడ్ వ్యాక్సిన్ నిబంధనల కారణంగా యూఎస్ ఓపెన్‌కు దూరమైన జొకోవిచ్.. న్యూయార్క్‌లో నాలుగో టైటిల్ అందుకోవడం ద్వారా ఓపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో సెరెనా విలియమ్స్ (23)ను అధిగమించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

