Novak Djokovic | కొవిడ్ వాక్సిన్ నిబంధనకు స్వస్తి.. యూఎస్ ఓపెన్‌లో ఆడనున్న జకోవిచ్
Novak Djokovic : వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్‌కు గుడ్‌న్యూస్. ఈ ఏడాది యూఎస్ ఓపెన్(US Open 2023)లో ఆడేందుకు అతడికి లైన్ క్లియర్ అయింది. అదెలాగంటే..? అంతర్జాతీయ పర్యాటకులకు కొవిడ్ వాక్సిన్ తప్పనిసరి అనే నిబంధనను అమెరికా ఎత్తేసింది. ఈ కొత్త నియమం మే 11 నుంచి అమలులోకి రానుంది. దాంతో, జకోవిచ్ ఈసారి ఎలాంటి కట్టుబాట్లు లేకుండా ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగనున్నాడు.

ఈ ఏడాది యూఎస్ ఓపెన్ ఆగష్టు 28 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు జరగనుంది. రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ వంటి దిగ్గజాలను ఓడించిన ఈ టెన్నిస్ స్టార్ ఇప్పటివరకు 22 గ్రాండ్‌స్లామ్స్ గెలిచాడు. వీటిలో మూడు యూఎస్ ఓపెన్ టైటిళ్లు ఉన్నాయి.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరం
గత ఏడాది కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఈ సెర్బియా స్టార్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన విషయం తెలిసిందే. వాక్సిన్ తీసుకోనందును నిర్వాహకులు అతడిని టోర్నీలో ఆడేందుకు అనుమంతించలేదు. దాంతో, జకో తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాక్సిన్ తీసుకోనని పట్టు పట్టిన అతను టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈసారి యూఎస్ ఓపెన్‌లో జకోకకు గట్టి పోటీ ఎదురుకానుంది. అందుకు కారణం… రెండో ర్యాంకులో ఉన్న యంగ్‌స్టర్ కార్లోస్ అల్కరాజ్(స్పెయిన్), మూడో ర్యాంకర్ దిమిత్రి మెద్వెదేవ్ సూపర్ ఫామ్‌లో ఉండడమే. మోకాలి గాయంతో బాధపడుతున్న రఫెల్ నాదల్ టోర్నీలో ఆడేది అనుమానమే.
ఇవి కూడా చదవండి
Nepal Cricket Team | చరిత్ర సృష్టించిన నేపాల్.. తొలిసారి ఆసియాకప్ ఆడనున్న పసికూన
ICC Test rankings: ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టేసి.. టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇండియా టాప్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!