పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో మూడోసీడ్ నొవాక్ జొకోవిచ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సెర్బియా వీరుడు జొకోవిచ్ 4-6, 7-6 (7/0), 6-2, 6-4తో కచనోవ్‌పై విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్‌లో ఇప్పటి వరకు 22 టైటిల్స్ నెగ్గి నాదల్‌తో సమంగా ఉన్న జొకోవిచ్.. మరో టైటిల్‌తో అగ్రస్థానానికి చేరేందుకు రెండడుగుల దూరంలో నిలిచాడు.
ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో జొకోవిచ్‌కు ఇది 45వ సెమీఫైనల్. ఈ జాబితాలో రోజర్ ఫెదరర్ (46) అగ్రస్థానంలో ఉండగా.. నాదల్ (38) మూడో ప్లేస్‌లో ఉన్నాడు. తాజా టోర్నీలో ఒక్క సెట్ కోల్పోకుండా క్వార్టర్స్ చేరిన జొకోవిచ్.. మంగళవారం తొలి సెట్లో పరాజయం పాలయ్యాడు. ఆ తర్వాత ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిన ఈ సెర్బియా వీరుడు వరుసగా మూడు సెట్లలో విజృంభించాడు. మహిళల సింగిల్స్‌లో సబలెంక, ముచోవా తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్‌కు చేరారు.