Australian open 2024 | గాఫ్ గర్జన.. సెమీస్‌కు అమెరికా యంగ్‌స్టర్ కోకో గాఫ్
సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో అమెరికా యంగ్ ప్లేయర్ నాలుగో సీడ్ కోకో గాఫ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గాఫ్ 7-6 (8/6), 6-7 (3/7), 6-2తో కోస్త్యుక్పై విజయం సాధించింది. తొలి రెండు సెట్లలో ఇరువురు ప్లేయర్లు కొదమ సింహాల్లో పోరాడటంతో.. మ్యాచ్ రసవత్తరంగా సాగింది.
- జొకో, సిన్నెర్ ముందంజ
అమెరికా యువ కెరటం కోకో గాఫ్.. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్‌కు చేరింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో కోస్త్యుక్పై విజయం సాధించిన గాఫ్.. సెమీస్‌లో రెండో సీడ్ సబలెంకతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ రికార్డు స్థాయిలో 11వ సారి ఆస్ట్రేలియా ఓపెన్ సెమీఫైనల్‌కు చేరాడు. గతంలో సెమీస్‌కు చేరిన పదిసార్లు.. ఫైనల్లో అడుగుపెట్టడంతో పాటు టైటిల్ నెగ్గిన జొకోవిచ్.. ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ చేసేందుకు తహతహలాడుతున్నాడు.
మెల్బోర్న్: సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో అమెరికా యంగ్ ప్లేయర్ నాలుగో సీడ్ కోకో గాఫ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గాఫ్ 7-6 (8/6), 6-7 (3/7), 6-2తో కోస్త్యుక్పై విజయం సాధించింది. తొలి రెండు సెట్లలో ఇరువురు ప్లేయర్లు కొదమ సింహాల్లో పోరాడటంతో.. మ్యాచ్ రసవత్తరంగా సాగింది. మూడు గంటలా 8 నిమిషాల పాటు సాగిన పోరులో 17 విన్నర్లు కొట్టిన గాఫ్.. 51 అనవసర తప్పిదాలు చేయగా.. 39 విన్నర్లు బాదిన కోస్త్యుక్ 8 డబుల్ ఫాల్ట్స్ చేసింది. నిరుడు యూఎస్ ఓపెన్ గెలిచిన తర్వాత గాఫ్‌కు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఇది వరుసగా 12వ విజయం కావడం విశేషం. మరో క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సబలెంక 6-2, 6-3తో తొమ్మిదో సీడ్ క్రెజికోవాపై విజయం సాధించింది. సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకతో గాఫ్ అమీతుమీ తేల్చుకోనుంది.
జొకో 11వ సారి..
ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని పెట్టని కోటలా మార్చుకున్న సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్.. రికార్డు స్థాయిలో 11వ సారి సెమీఫైనల్‌కు చేరాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 7-6 (7/3), 4-6, 6-2, 6-3తో 12వ సీడ్ ఫ్రిట్జ్‌పై గెలుపొందాడు. గతంలో ఈ టోర్నీలో 10 సార్లు సెమీస్ చేరిన జొకో.. ఆ పది సార్లు టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ దాటిన తర్వాత జొకోవిచ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడకపోవడం విశేషం. ఓవరాల్‌గా జొకోకు ఇది 48వ గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ కావడం గమనార్హం. 3 గంటలా 45 నిమిషాల పాటు సాగిన పోరులో.. తొలి సెట్ గంటన్నర పాటు సాగింది. తాజా టోర్నీలో ఇదే సుదీర్ఘ సెట్ కాగా.. టైబ్రేకర్‌లో జొకో ముందంజ వేశాడు. ఇక రెండో సెట్లో రెట్టించిన ఉత్సాహంతో చెలరేగిపోయిన ఫ్రిట్జ్.. పదునైన సర్వీస్‌లకు తోడు బలమైన బ్యాక్ హ్యాండ్ షాట్లతో జొకోవిచ్‌ను నిలువరించాడు. అయితే ఆ తర్వాత తేరుకున్న నొవాక్.. వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. 16 ఏస్‌లు బాదిన జొకో.. 63 విన్నర్లు సంధిస్తే.. 20 ఏస్‌లు కొట్టిన ఫ్రిట్జ్ 52 విన్నర్లకే పరిమితమయ్యాడు. మరో క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సిన్నెర్ 6-4, 7-6 (7/5), 6-3తో ఐదో సీడ్ రుబ్లెవ్‌పై గెలుపొందాడు. సెమీఫైనల్లో సిన్నెర్తో జొకోవిచ్ తలపడనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

