Captain Cool | కెప్టెన్ కూల్ ధోనీ కాదట.. ఎవరో చెప్పిన గవాస్కర్
Captain Cool | భారత క్రికెట్ జట్టులో ‘కెప్టెన్ కూల్’ (Captain Cool) అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది టీమిండియా మాజీ సారధి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) పేరే. అయితే, భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గవాస్కర్ (Sunil Gavaskar) దృష్టిలో మాత్రం ‘మిస్టర్ కూల్’ ధోనీ కాదట. టీం ఇండియా ‘ఒరిజినల్ మిస్టర్ కూల్’ (Original Captain Cool) ఎవరో తాజాగా చెప్పుకొచ్చారు గవాస్కర్.
Captain Cool | భారత క్రికెట్ జట్టులో ‘కెప్టెన్ కూల్’ (Captain Cool) అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది టీమిండియా మాజీ సారధి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) పేరే. మైదానంలో ఎంత ఒత్తిడి ఉన్నా ప్రశాంతంగా ఉంటూ జట్టును ముందుండి నడిపిస్తూ అందరి ప్రశంసలు పొందుతుంటాడు. ఎంతో కూల్ గా కనిపించే మహీ.. కీలక సమయాల్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించేవాడు. తన కూల్ కెప్టెన్సీలో భారత జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. అయితే, భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గవాస్కర్ (Sunil Gavaskar) దృష్టిలో మాత్రం ‘మిస్టర్ కూల్’ ధోనీ కాదట. టీం ఇండియా ‘ఒరిజినల్ మిస్టర్ కూల్’ (Original Captain Cool) ఎవరో తాజాగా చెప్పుకొచ్చారు గవాస్కర్.
సరిగ్గా 40 ఏళ్ల కిందట టీమిండియాకు తొలి ప్రపంచకప్ (World Cup) అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev)..‘ఒరిజినల్ కెప్టెన్ కూల్’ అని అభిప్రాయపడ్డారు. టీమిండియా 1983 ప్రపంచకప్ ను సొంతం చేసుకొని జూన్ 25వ తేదీకి 40 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
1983 ప్రపంచకప్ లో అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన టీమిండియా.. కపిల్ సారథ్యంలో చాంపియన్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ ప్రపంచకప్ లో కపిల్ దేవ్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టారు. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా ఫైనల్ లో విచ్ రిచర్డ్స్ ను ఔట్ చేయడానికి అతని క్యాచ్ చరిత్రపుటలో నిలిచిపోయింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫైనల్లో విండీస్ ను ఓడించి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. మిస్టర్ కూల్ గురించి గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read..
Maharashtra | బీఫ్ మాంసం తరలిస్తున్నారన్న అనుమానంతో.. ముస్లిం వ్యక్తిని కొట్టి చంపిన గోసంరక్షకులు
Himachal Pradesh Floods | హిమాచల్ లో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న పర్యాటకులు
Wrestlers | ఇకపై రోడ్డెక్కబోం.. కోర్టులో తేల్చుకుంటాం : రెజ్లర్ల కీలక నిర్ణయం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

