MI vs CSK : ఐపీఎల్లో ఐదుసార్లు ఛాంపియన్లు మరోసారి బిగ్ ఫైట్‌కు సిద్ధమయ్యాయి. టోర్నీ చరిత్రలో తొలిసారి రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ లేకుండా ఆడిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కూడా దిగ్గజాల గైర్హాజరీలోనే తలపడుతున్నాయి. చెపాక్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా వికెట్ బాగుందని బ్యాటింగ్ తీసుకున్నాడు.
సన్‌రైజర్స్ హైదారబాద్ చేతిలో చిత్తైన ముంబై విజయంపై కన్నేయగా.. సొంత గడ్డపై పంజా విసరాలని సీఎస్కే భావిస్తోంది. వాంఖడేలో ముంబైపై 103 పరుగుల తేడాతో గెలుపొందిన చెన్నై ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌తో ముంబై తరఫున పంజాబ్ కుర్రాడు రఘు శర్మ అరంగేట్రం చేస్తున్నాడు. సీఎస్కే తుది జట్టులో ప్రశాంత్ వీర్, రామకృష్ణ ఘోష్‌లకు చోటు దక్కింది.
🚨 TOSS 🚨@mipaltan have won the toss and will bat first against @ChennaiIPL
Updates ▶️ https://t.co/VVAjldiiC0#TATAIPL | #KhelBindaas | #CSKvMI pic.twitter.com/Ad8xV5Adku
— IndianPremierLeague (@IPL) May 2, 2026
చెన్నై తుది జట్టు : సంజూ శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఉర్విల్ పటేల్, బ్రెవిస్, దూబే, ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్.
ఇంప్యాక్ట్ సబ్స్ – కార్తిక్ శర్మ, అకీల్ హొసేన్, సర్ఫరాజ్ ఖాన్, మాథ్యూ షార్ట్, గుర్జప్నీత్ సింగ్.
ముంబై తుది జట్టు : విల్ జాక్స్, రియాన్ రికెల్టన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, నమన్ ధిర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రాబిన్ మింజ్, బౌల్ట్, క్రిష్ భగత్, బుమ్రా, గజన్ఫర్.
ఇంప్యాక్ట్ సబ్స్ – రాజ్ బవ, రఘు శర్మ, మయాంక్ రావత్, శార్ధూల్ ఠాకూర్, అశ్వనీ కుమార్.