Lungi Ngidi : పంతొమ్మిదో సీజన్లో అనూహ్యగా ఆస్పత్రి పాలైన లుంగి ఎంగిడి (Lungi Ngidi) ఫిట్నెస్ సాధించాడు. ఫీల్డింగ్ చేస్తూ కిందపడి పల్లీ కొట్టిన ఎంగిడి తల గాయం నయమవ్వడంతో మళ్లీ ఆటకు సిద్ధమయ్యాడు. మ్యాచ్ కోసం ఈ సఫారీ పేసర్ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) స్క్వాడ్‌లో చేరాడు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఫ్రాంచైజీ వెల్లడించింది. ‘ఎంగిడి వచ్చేశాడు. స్క్వాడ్‌తో కలిశాడు’ అని ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేసింది ఢిల్లీ యాజమాన్యం.
ఐపీఎల్-19లో కంకషన్‌కు గురైన ఎంగిడి పూర్తిగా కోలుకొని ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్‌తో కలిశాడు. ఈ విషయాన్ని ఢిల్లీ పేసర్ కైలీ జేమీసన్ ‘ఎంగిడి తిరిగొచ్చాడు. మళ్లీ అతడు ఆడేందుకు సిద్ధమవుతున్నాడు’ అని చెబుతున్న వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసింది యాజమాన్యం. ఫ్రాంచైజీ పంచుకున్న ఆ వీడియోలో ఎంగిడి బౌలింగ్ సాధన చేస్తున్నాడు. అయితే.. ఎంగిడి వచ్చినా ఫ్రాంచైజీ మాత్రం ఒకింత అసంతృప్తితో ఉంది. ఎందుకంటే.. మే 1వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు ఈ స్పీడ్‌స్టర్ అందుబాటులో ఉండడు.
Ladies & gentlemen…. Lungi Ngidi!! 💥🥁 pic.twitter.com/LrFO2qQrPq
— Delhi Capitals (@DelhiCapitals) April 30, 2026
ఎందుకంటే.. ఐసీసీ నియమావళి ప్రకారం కంకషన్‌కు గురైన ఆటగాడికి కనీసం ఏడు రోజులు విశ్రాంతినివ్వాలి. కానీ, ఎంగిడి కంకషన్తో మైదానం వీడి మే 1 నాటికి ఆరు రోజులు అవుతుంది. కాబట్టి. తదుపరి మ్యాచ్‌కు ఎంగిడి జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ఢిల్లీ తరఫున ఈ సీజన్లో గొప్పగా రాణిస్తున్న ఎంగిడి 6 మ్యాచుల్లో 7 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకూ ఆడిన 8 మ్యాచుల్లో మూడే విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతున్న ఢిల్లీ.. మే 1 న రాజస్థాన్‌ను ఓడిస్తే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. కానీ, కీలకమైన ఈ మ్యాచ్‌కు ఎంగిడి దూరమవ్వడంతో ఢిల్లీ షాక్‌లో ఉండిపోయింది.
ఏప్రిల్ 25న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు ఎంగిడి. ఢిల్లీ నిర్దేశించిన 264 పరుగుల భారీ ఛేదనలో దంచేస్తున్న పంజాబ్ ఓపెనర్ ప్రియాన్స్ ఆర్య.. అక్షర్ పటేల్ వేసిన మూడో ఓవర్లో గాల్లోకి లేపాడు. బంతిని సరిగ్గా అంచనా వేయని ఎంగిడి వెనక్కి పరుగెడుతూ క్యాచ్ అందుకోబోయి కింద పడిపోయాడు. అలా పడడంతో నేలకు అతడి తల బలంగా తాకింగి. దాంతో, నొప్పితో విలవిలలాడుతూ తల పట్టుకున్నాడు ఎంగిడి. హుటాహుటిన ఫిజియో వచ్చి పరీక్షించినా ఎంగిడి స్పందించలేదు.
🚨 Delhi Capitals pacer Lungi Ngidi suffers serious head injury.
He misjudged a catch & fell awkwardly, remaining motionless on the field for a while.
Medical staff rushed in immediately, with a stretcher and ambulance brought onto the ground
Prayers 🙏🏻pic.twitter.com/i1dSaby9J4 https://t.co/M12kdQGtwo
— News Algebra (@NewsAlgebraIND) April 25, 2026
దాంతో, ఢిల్లీ ఆటగాళ్లు, అభిమానులు అసలు ఏం జరిగింది? అని షాక్‌లో ఉండిపోయారు. మైదానంలోకి అంబులెన్స్‌ను రప్పించారు. స్ట్రెచర్ మీద ఎంగిడిని అందులోకి ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అత్యవసర వైద్యం, స్కానింగ్ పరీక్షల అనంతరం అతడి ఆరోగ్యంపై ఢిల్లీ యాజమాన్యం అప్డేట్ ఇవ్వనుంది. నొప్పితో ఎంగిడి మైదానం వీడడంతో అతడికి సబిస్టిట్యూట్‌గా దుష్యంత్ చమీర వచ్చాడు.