కివీస్ 162 ఆలౌట్
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఆసీస్‌కు టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 45.2 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది. హాజిల్‌వుడ్(5-31) ఐదు వికెట్ల విజృంభణకు తోడు మిచెల్ స్టార్క్(3-59) ధాటికి కివీస్ బ్యాటర్లు విలవిలలాడిపోయారు.
- ఆసీస్‌తో రెండో టెస్టు
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఆసీస్‌కు టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 45.2 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది. హాజిల్‌వుడ్(5-31) ఐదు వికెట్ల విజృంభణకు తోడు మిచెల్ స్టార్క్(3-59) ధాటికి కివీస్ బ్యాటర్లు విలవిలలాడిపోయారు. కెరీర్లో వందో టెస్టు ఆడుతున్న కేన్ విలియమ్సన్(17), కెప్టెన్ టిమ్ సౌథీ(26) తీవ్రంగా నిరాశపరిచారు. పచ్చికతో కళకళలాడుతున్న పిచ్‌పై హాజిల్‌వుడ్ తన స్వింగ్‌తో కివీస్‌కు ముచ్చెమటలు పట్టించాడు. స్వింగ్ బౌలింగ్‌తో వరుస విరామాల్లో కివీస్ బ్యాటర్లను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్ శుక్రవారం ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్(45), లియాన్(1) క్రీజులో ఉన్నారు. మ్యాట్ హెన్రీ(3-39) మూడు వికెట్లతో రాణించాడు. చేతిలో ఆరు వికెట్లు ఉన్న ఆసీస్ 38 పరుగుల వెనుకంజలో కొనసాగుతున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

