హెన్రీ దెబ్బకు హరీ89కే ఢమాల్
మౌంట్ మాంగనుయ్: టీ20 సిరీస్ సొంతం చేసుకొని తొలి రెండు వన్డేలు నెగ్గి జోరుమీదున్న భారత్‌కు షాక్. మరో విజయంతో వన్డే సిరీస్‌నూ పట్టేయాలని ఆశించిన టీమిండియాను ఒక్క దెబ్బకు న్యూజిలాండ్ నేలకు దించింది. విల్ యంగ్ (108 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 125) శతకంతో బౌలర్లకు ఎదురు నిలిస్తే.. పేసర్ మాథ్యూ హెన్రీ (6/27) కెరీర్ బెస్ట్ బౌలింగ్‌తో నిప్పులు చెరగడంతో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో భారత్ 244 పరుగుల తేడాతో ఘోర పరాజయం ఖాతాలో వేసుకుంది. కివీస్ ఇచ్చిన 334 పరుగుల ఛేదనలో హెన్రీ పేస్ దెబ్బకు బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో టీమిండియా 26.4 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. ఇషాన్ కిషన్ (27) టాప్ స్కోరర్. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 50 ఓవర్లలో 333 రన్స్‌కు ఆలౌటైంది. యంగ్‌తో పాటు సిఫర్ట్ (58), ఫిన్ అలెన్ (41) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (2/39) పొదుపుగా బౌలింగ్ చేసినా..మిగతా బౌలర్లు నిరాశపరిచారు. హెన్రీకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో సిరీస్ 1-2తో సిరీస్ ఆశలను కివీస్ సజీవంగా నిలుపుకుంది.చివరి, ఐదో వన్డే ఆదివారం ఇదే వేదికపై జరగనుంది. సున్నాకే మూడు భారీ లక్ష్య ఛేదనలో హెన్రీ తొలి ఓవర్లోనే భారత్ నడ్డివిరిచాడు. స్కోరుబోర్డుపై ఒక్క పరుగు చేరకముందే మూడు వికెట్లు పడగొట్టాడు. తొలి బంతికే ఓపెనర్ రోహిత్ (0) స్లిప్‌లో అలెన్‌కు క్యాచ్ ఇవ్వగా.. తక్కువ ఎత్తులో వచ్చిన ఐదో బంతిని డిఫెండ్ చేసే ప్రయత్నంలో కోహ్లీ (0) బౌల్డ్ అయ్యాడు. ఆఖరి బంతికి స్టాండిన్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (0) వికెట్లు ముందు అడ్డంగా దొరకడంతో భారత్ 0/3తో ఎదురీత మొదలు పెట్టింది. కొద్దిసేపటికే రుతురాజ్ గైక్వాడ్ (5)ను బ్రేస్‌వెల్ పెవిలియన్ చేర్చగా.. తన తొలి బంతికే క్యాచ్ ఔట్ నుంచి తప్పించుకున్న అక్షర్ పటేల్ (21), ఇషాన్ కిషన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఒక్కో పరుగు జోడిస్తూ 16 ఓవర్లకు స్కోరు యాభై దాటించారు. కానీ, క్రీజులో కుదురుకున్న అక్షర్‌ను ఫిషర్ ఎక్స్ట్రా బౌన్స్‌తో బోల్తా కొట్టించడంతో 53 రన్స్‌కే భారత్ సగం వికెట్లు కోల్పోయింది. ఇక తన రెండో స్పెల్ తొలి బంతికే మరో అద్భుత డెలివరీతో ఇషాన్‌ను బౌల్డ్ చేసిన హెన్రీ .. కాసేపటికే కుల్దీప్ (1)ను స్టంప్స్ కూడా ఎగురగొట్టి ఐదో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. తన బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టిన నమన్ ధీర్ (21)ను ఫిషర్ తొమ్మిదో వికెట్‌గా ఔట్ చేశాడు. వెంటనే ఓ యార్కర్‌తో బ్రార్ (2)ను బౌల్డ్ చేసిన హెన్రీ భారత్‌ను ఆలౌట్ చేశాడు.
-
నాలుగో వన్డేలో భారత్ చిత్తు
-
244 పరుగుల తేడాతో ఘోర పరాజయం
-
6 వికెట్లతో దెబ్బకొట్టిన కివీస్ పేసర్ హెన్రీ.. యంగ్ సెంచరీ
మౌంట్ మాంగనుయ్: టీ20 సిరీస్ సొంతం చేసుకొని తొలి రెండు వన్డేలు నెగ్గి జోరుమీదున్న భారత్‌కు షాక్. మరో విజయంతో వన్డే సిరీస్‌నూ పట్టేయాలని ఆశించిన టీమిండియాను ఒక్క దెబ్బకు న్యూజిలాండ్ నేలకు దించింది. విల్ యంగ్ (108 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 125) శతకంతో బౌలర్లకు ఎదురు నిలిస్తే..
పేసర్ మాథ్యూ హెన్రీ (6/27) కెరీర్ బెస్ట్ బౌలింగ్‌తో నిప్పులు చెరగడంతో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో భారత్ 244 పరుగుల తేడాతో ఘోర పరాజయం ఖాతాలో వేసుకుంది. కివీస్ ఇచ్చిన 334 పరుగుల ఛేదనలో హెన్రీ పేస్ దెబ్బకు బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో టీమిండియా 26.4 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. ఇషాన్ కిషన్ (27) టాప్ స్కోరర్. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 50 ఓవర్లలో 333 రన్స్‌కు ఆలౌటైంది. యంగ్‌తో పాటు సిఫర్ట్ (58), ఫిన్ అలెన్ (41) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (2/39) పొదుపుగా బౌలింగ్ చేసినా..మిగతా బౌలర్లు నిరాశపరిచారు. హెన్రీకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో సిరీస్ 1-2తో సిరీస్ ఆశలను కివీస్ సజీవంగా నిలుపుకుంది.చివరి, ఐదో వన్డే ఆదివారం ఇదే వేదికపై జరగనుంది.
సున్నాకే మూడు
భారీ లక్ష్య ఛేదనలో హెన్రీ తొలి ఓవర్లోనే భారత్ నడ్డివిరిచాడు. స్కోరుబోర్డుపై ఒక్క పరుగు చేరకముందే మూడు వికెట్లు పడగొట్టాడు. తొలి బంతికే ఓపెనర్ రోహిత్ (0) స్లిప్‌లో అలెన్‌కు క్యాచ్ ఇవ్వగా.. తక్కువ ఎత్తులో వచ్చిన ఐదో బంతిని డిఫెండ్ చేసే ప్రయత్నంలో కోహ్లీ (0) బౌల్డ్ అయ్యాడు. ఆఖరి బంతికి స్టాండిన్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (0) వికెట్లు ముందు అడ్డంగా దొరకడంతో భారత్ 0/3తో ఎదురీత మొదలు పెట్టింది. కొద్దిసేపటికే రుతురాజ్ గైక్వాడ్ (5)ను బ్రేస్‌వెల్ పెవిలియన్ చేర్చగా.. తన తొలి బంతికే క్యాచ్ ఔట్ నుంచి తప్పించుకున్న అక్షర్ పటేల్ (21), ఇషాన్ కిషన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఒక్కో పరుగు జోడిస్తూ 16 ఓవర్లకు స్కోరు యాభై దాటించారు.
కానీ, క్రీజులో కుదురుకున్న అక్షర్‌ను ఫిషర్ ఎక్స్ట్రా బౌన్స్‌తో బోల్తా కొట్టించడంతో 53 రన్స్‌కే భారత్ సగం వికెట్లు కోల్పోయింది. ఇక తన రెండో స్పెల్ తొలి బంతికే మరో అద్భుత డెలివరీతో ఇషాన్‌ను బౌల్డ్ చేసిన హెన్రీ .. కాసేపటికే కుల్దీప్ (1)ను స్టంప్స్ కూడా ఎగురగొట్టి ఐదో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. తన బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టిన నమన్ ధీర్ (21)ను ఫిషర్ తొమ్మిదో వికెట్‌గా ఔట్ చేశాడు. వెంటనే ఓ యార్కర్‌తో బ్రార్ (2)ను బౌల్డ్ చేసిన హెన్రీ భారత్‌ను ఆలౌట్ చేశాడు.
యంగ్ శతక జోరు
తొలుత భారత బౌలింగ్, ఫీల్డింగ్ బలహీనతలను సద్వినియోగం చేసుకుని యంగ్ శతకంతో విజృంభించి కివీస్‌కు భారీ స్కోరు అందించాడు. నబీ వేసిన రెండో ఓవర్లో వరుసగా రెండు బంతుల్లో యంగ్ ఇచ్చిన క్యాచ్‌లను ఫస్ట్ స్లిప్‌లో రోహిత్, కీపర్ ఇషాన్ డ్రాప్ చేశారు. దీనికి భారత్ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఈ చాన్స్‌లను యంగ్ సద్వినియోగం చేసుకున్నాడు. మొదట సిఫర్ట్ దూకుడుగా ఆడి 39 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, బ్రార్ బౌలింగ్‌లో కిషన్‌కు క్యాచ్ ఇచ్చి తను వెనుదిరిగిన తర్వాత యంగ్ ఆటతీరు మారింది. నిక్ కెల్లీ (4)ను అక్షర్, ఫాక్స్‌క్రాఫ్ట్ (8)ను నబీ పెవిలియన్ చేర్చినా.. అలెన్ తోడుగా యంగ్ దూకుడు పెంచాడు. అక్షర్ మంచి లైన్లో బంతులు వేసి కట్టడి చేసినా..
మిగతా స్పిన్నర్లు కుల్దీప్, నమన్ ధీర్‌ను యంగ్, అలెన్ టార్గెట్ చేశారు. 49 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన యంగ్ తర్వాతి 50 పరుగులను 39 బంతుల్లో పూర్తి చేశాడు. బ్రార్, కుల్దీప్ బౌలింగ్‌లో ఒక్కో సిక్సర్ కొట్టాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో క్రీజు దాటొచ్చి స్వేచ్ఛగా షాట్లు ఆడాడు. స్కోరు 200 దాటిన తర్వాత అలెన్‌ను అక్షర్ ఔట్ చేసినా.. యంగ్ అదే జోరు కొనసాగించడంతో కివీస్ ఓ దశలో 350 ప్లస్ స్కోరు చేసేలా కనిపించింది. అయితే, ధీర్ బౌలింగ్‌లో స్వీప్ షాట్‌కు ట్రై చేసి యంగ్ ఔటైన తర్వాత భారత బౌలర్లు పుంజుకున్నారు. చివరి 10 ఓవర్లలో 68 పరుగులే ఇచ్చినా కివీస్ మంచి స్కోరు సాధించింది.
- వన్డేల్లో పరుగుల పరంగా భారత్‌కు రెండో అది పెద్ద పరాజయం. . 2000లో శ్రీలంక చేతిలో 245 పరుగుల తేడాతో ఓడింది.
- ఈ ఫార్మాట్లో ఒక్క పరుగు చేయకుండానే తొలి మూడు వికెట్లు కోల్పోయిన రెండో జట్టు భారత్. పాకిస్థాన్ ( 1997లో
సౌతాఫ్రికాతో మ్యాచ్) ముందుంది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్: 50 ఓవర్లలో 333 ఆలౌట్ (విల్ యంగ్ 125, సిఫర్ట్ 58, అక్షర్ పటేల్ 2/39); భారత్: 26.4 ఓవర్లలో 89 ఆలౌట్ (ఇషాన్ 27, హెన్రీ 6/27, ఫిషర్ 3/31)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

