న్యూజిలాండ్ ప్లేయర్లను కట్టడి చేయడానికి భారత బౌలర్లు బాగానే శ్రమిస్తున్నారు. మూడు నాలుగు ఓవర్ల వరకు న్యూజిలాండ్ పెద్దగా స్కోర్ చేయలేదు కానీ.. విలియమ్సన్ బరిలోకి దిగాక స్కోర్ పెరిగింది. మిచెల్.. 14 బంతుల్లో 19 పరుగులు చేశాడు. జడెజా బౌలింగ్‌లోనే రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ప్రస్తుతం క్రీజులో మిచెల్, విలియమ్సన్ ఉన్నారు.
పవర్ ప్లే ముగిసే సమయానికి 6 ఓవర్లకు న్యూజిలాండ్ ఒక వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. రన్ రేట్ 7.33 గా ఉంది.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 ఓవర్లు వేసి 18 పరుగులు ఇవ్వగా.. బుమ్రా.. 2 ఓవర్లు వేసి 11 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. జడెజా ఒక ఓవర్ వేసి 14 పరుగులు అందించాడు.