Caribbean Premier League | ఇకపై క్రికెట్లోనూ రెడ్ కార్డ్.. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో వినూత్న ప్రయోగం
Caribbean Premier League : ఫుట్‌బాల్(Football) ఫాలో అయ్యే వారందరికీ రెడ్ కార్డు(Red Card) పరిచయమే ఉంటుంది. సాకర్ మ్యాచ్‌లో ఏ ఆటగాడైనా నిబంధనలు అతిక్రమించడం, ఉద్దేశ పూర్వకంగా ప్రత్యర్థి ఆటగాడిని గాయపరచడం వంటి చర్యలకు పాల్పడితే రిఫరీ(Referee) అతడికి రెడ్ కార్డ్ చూపించి మైదానం బయటకు పంపడం ఆనవాయితీ. అయితే.. ఈ ప్రక్రియను క్రికెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు..
Caribbean Premier League : ఫుట్‌బాల్(Football) ఫాలో అయ్యే వారందరికీ రెడ్ కార్డు(Red Card) పరిచయమే ఉంటుంది. సాకర్ మ్యాచ్‌లో ఏ ఆటగాడైనా నిబంధనలు అతిక్రమించడం, ఉద్దేశ పూర్వకంగా ప్రత్యర్థి ఆటగాడిని గాయపరచడం వంటి చర్యలకు పాల్పడితే రిఫరీ(Referee) అతడికి రెడ్ కార్డ్ చూపించి మైదానం బయటకు పంపడం ఆనవాయితీ. అయితే.. ఈ ప్రక్రియను క్రికెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలిసారి దీన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(West Indies Cricket Board) కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2023) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని చూస్తోంది.
నిర్ణీత సమయంలో మ్యాచ్‌లు జరిగేందుకు ఈ నిబంధన ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం స్లో ఓవర్ రేట్(Slow Over Rate)ను నియంత్రించేందుకు ఐసీసీ కొన్ని నిబంధనలు పాటిస్తోంది. టీ20ల్లో నిర్ణీత సమయంలో ఓవర్లు ముగించకపోతే.. చివరి ఓవర్లో 30 యార్డ్స్ సర్కిల్ బయట ఒక ఫీల్డర్‌ను తగ్గించాల్సి ఉంటుంది. దీంతో పాటు జరిమానాలు, డీ మెరిట్ పాయింట్ల వంటివి ఉండనే ఉన్నాయి. అయితే ఇప్పుడు సీపీఎల్‌లో మరో అడుగు ముందుకు వేసి రెడ్ కార్డ్ నిబంధన తీసుకురావాలని చూస్తోంది.
షెడ్యూల్ సమయంలో
‘కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో మ్యాచ్‌లు నిర్ణీత సమయంలో పూర్తి కావడం లేదు. ఎక్కువ టైం తీసుకుంటున్నాయి. దీన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాం. నిర్ణీత సమయంలో ఆట ముగియకపోతే అభిమానులు అసహనానికి గురవుతారు. అందుకే షెడ్యూల్ సమయంలో మ్యాచ్‌ను పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. రెడ్ కార్డ్ రూల్ తేవడం వల్లనైనా స్లో ఓవర్ రేటు తగ్గుతుందని ఆశిస్తున్నాం’ అని సీపీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైకేల్ హాల్(Michael Hall) అన్నాడు.
సరాసరిన 4 నిమిషాల..
రెడ్ కార్డు రూల్ ప్రకారం 17వ ఓవర్ షెడ్యూల్ సమయానికి పూర్తి కాకపోతే మిగిలిన 2 ఓవర్లలో ఓ ఫీల్డర్ 30 యార్డ్స్ సర్కిల్లో మొహరించాల్సి ఉంటుంది. చివరి ఓవర్లో ఓ ప్లేయర్‌ను రెడ్ కార్డు ద్వారా మైదానం బయటకు పంపుతారు. ఎవరిని బయటకు పంపాలనే నిర్ణయం కెప్టెన్ తీసుకుంటాడు. ఒక వేళ బ్యాటింగ్ టీమ్ కాలాన్ని వృథా చేస్తే.. వార్నింగ్ ఇస్తారు. అయినా తీరు మారకపోతే 5 పరుగులను పెనాల్టీ కింద కట్ చేస్తారు. ఈ నిబంధనల్లో 20 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 85 నిమిషాలు కేటాయించారు. అంటే సరాసరిన 4 నిమిషాల 15 సెకన్లలో ఒక ఓవర్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
Allu Arjun | చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు!
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

