లక్నో: వన్డే ప్రపంచకప్‌లో ముగ్గురు మాజీ చాంపియన్లను మట్టికరిపించి ఫుల్ జోష్‌లో ఉన్న అఫ్గానిస్థాన్ శుక్రవారం నెదర్లాండ్స్‌తో అమీతుమీకి సిద్ధమైంది. ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక వంటి జట్లను అవలీలగా ఓడించిన అఫ్గానిస్థాన్.. అదే జోరులో నెదర్లాండ్స్‌ను చిత్తుచేయాలని చూస్తుంటే.. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై సాధించిన విజయాల స్ఫూర్తిగా ముందుకు సాగాలని నెదర్లాండ్స్ యోచిస్తున్నది.
మరి స్పిన్‌కు సహకరించనున్న లక్నో పిచ్‌పై రషీద్‌ఖాన్, ముజీబ్, నబితో కూడిన బౌలింగ్ దళాన్ని డచ్ జట్టు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. రాహ్మానుల్లా, రహ్మత్ షా, హష్మతుల్లా, అజ్మతుల్లాతో అఫ్గాన్ బ్యాటింగ్ కూడా బలంగా కనిపిస్తున్నది.