ఖాట్మాండు: నేపాల్‌కు చెందిన ఫేమస్ క్రికెటర్ సందీప్ లామిచానే.. అత్యాచార కేసులో దోషిగా తేలాడు. టీనేజ్ అమ్మాయిని రేప్ చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో అతనికి పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులో తీర్పును జనవరి 10వ తేదీన వెలువరించనున్నారు. 23 ఏళ్ల సందీప్ నేపాల్‌లో మేటి క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక టీ20 టోర్నీల్లో అతను ఆడాడు. ఇక రేప్ కేసు నమోదు కావడంతో అతన్ని గత ఏడాది నేపాల్ కెప్టెన్సీ నుంచి తప్పించారు. అరెస్టు వారెంట్ జారీ చేసి అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఇటీవల అతన్ని బెయిల్‌పై రిలీజ్ చేశారు. కానీ ఆ కేసులో లమిచానేకు పదేళ్ల శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అత్యున్నత కోర్టులో దీనిపై అప్పీల్ చేయనున్నట్లు చెప్పాడు. నేపాల్ కోర్టు విచారణ పట్ల లాయర్ సబితా భండారి బరాల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.