Neeraj Chopra: లుసేన్ డైమండ్ లీగ్ గెలిచిన నీరజ్ చోప్రా.. వీడియో
Neeraj Chopra: లుసేన్లో జరిగిన ఈవెంట్లో తన జావెలిన్‌ను 87.66 మీటర్ల దూరం విసిరి టాప్ ప్లేస్ కొట్టేశాడు నీరజ్ చోప్రా. డైమండ్ లీగ్ ఫైనల్స్ కోసం తన పాయింట్ల పట్టికను పెంచేసుకున్నాడు. గాయం వల్ల దాదాపు నెల రోజుల పాటు రెస్టు తీసుకున్న నీరజ్.. లుసేన్ ఈవెంట్లో తన అయిదో ప్రయత్నంలో జావెలిన్‌ను 87.66 మీటర్ల దూరం విసిరాడు.
లుసేన్: మేటి జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra).. డైమండ్ లీగ్‌లో మళ్లీ సత్తా చాటాడు. లుసేన్లో జరిగిన ఈవెంట్లో తన జావెలిన్‌ను 87.66 మీటర్ల దూరం విసిరి టాప్ ప్లేస్ కొట్టేశాడు. డైమండ్ లీగ్ ఫైనల్స్ కోసం తన పాయింట్ల పట్టికను పెంచేసుకున్నాడు. దాదాపు గాయం వల్ల నెల రోజుల పాటు రెస్టు తీసుకున్న నీరజ్.. లుసేన్ ఈవెంట్లో తన అయిదో ప్రయత్నంలో జావెలిన్‌ను 87.66 మీటర్ల దూరం విసిరాడు. తొలుత ఫౌల్‌తో స్టార్ట్ చేసి అతను ఆ తర్వాత 83.52 మీటర్లు, 85.04 మీటర్ల దూరం జావెలిన్ త్రో చేశాడు. ఇక తన నాలుగో ప్రయత్నంలో మళ్లీ ఫౌల్ అయ్యాడు.
Neeraj Chopra Win Lausanne Diamond League with brilliant 87.66m throw
Good series of 83.52 , 85.04, 87.66 and 84.15 by Olympic Champion
Second win for neeraj at this year DL , he leads JT ranking after 2 meeting @afiindia pic.twitter.com/9UTJ0ebgCz
— Sports India (@SportsIndia3) June 30, 2023
అయిదోసారి మాత్రం 87.66 మీటర్ల దూరం త్రో చేశాడు. ఆరవ, ఏడో ప్రయత్నంలో అతను జావెలిన్‌ను 84.15 మీటర్ల దూరం విసిరాడు. జర్మనీకి చెందిన జులియన్ వెబర్ రెండో స్థానంలో నిలిచాడు. అతను 87.03 మీటర్ల దూరం వేశాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వద్లేజ్ 86.13 మీటర్ల దూరం వేశాడు. గత ఏడాది ఆగస్టులోనూ లుసేన్ డైమండ్ లీగ్‌ను నీరజ్ చోప్రా గెలిచాడు. ఆ తర్వాత నెలలోనే అతను లీగ్ ట్రోఫీని చేజిక్కించుకున్నాడు. ఈ ఏడాది మేలో దోహాలో జరిగిన డైమండ్ లీగ్‌ను నీరజ్ గెలుచుకున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

