Neeraj Chopra | నీరజ్ నయా చరిత్ర.. జావెలిన్‌త్రోలో 90.23 మీటర్లతో సరికొత్త రికార్డు
భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా కొత్త చరిత్ర లిఖించాడు. జావెలిన్‌త్రోలో తనకంటూ ప్రత్యేకతను నిలుపుకుంటూ సరికొత్త రికార్డుతో నీరజ్ కదంతొక్కాడు. శుక్రవారం దోహా వేదికగా మొదలైన ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్‌లో నీరజ్ తొలిసారి 90.23 మీటర్ల మార్క్ అందుకుని ఔరా అనిపించాడు.
- 91.06 మీటర్లతో చోప్రాను దాటేసిన వెబర్
Neeraj Chopra | దోహా: భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా కొత్త చరిత్ర లిఖించాడు. జావెలిన్‌త్రోలో తనకంటూ ప్రత్యేకతను నిలుపుకుంటూ సరికొత్త రికార్డుతో నీరజ్ కదంతొక్కాడు. శుక్రవారం దోహా వేదికగా మొదలైన ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్‌లో నీరజ్ తొలిసారి 90.23 మీటర్ల మార్క్ అందుకుని ఔరా అనిపించాడు. గత కొన్నేండ్లుగా ఊరిస్తూ వస్తున్న 90 మీటర్ల దూరాన్ని తన మూడో ప్రయత్నంలో సాధించాడు. ఈ క్రమంలో గతంలో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు(89.94మీ)ను చోప్రా బద్దలు కొట్టాడు. పోటీలో తన మొదటి ప్రయత్నంలోనే 88.44మీటర్ల మార్క్ అందుకున్న ఈ స్టార్ అథ్లెట్..రెండో ప్రయత్నంలో ఫౌల్ అయ్యాడు. అయితే మూడో ప్రయత్నంలో తన బలాన్నంతటినీ కూడదీసుకుంటూ ఇన్నాళ్లుగా అందినట్లే అంది దూరమవుతున్న 90మీటర్ల దూరాన్ని ఒడిసిపట్టుకున్నాడు.
అదే జోరును కొనసాగించడంలో చోప్రా ఒకింత విఫలమయ్యాడు. నాలుగో ప్రయత్నంలో 80.56మీటర్లు విసిరిన నీరజ్ ఐదోసారి ఫౌల్ అయ్యాడు. ఆఖరిదైన ఆరో త్రోలో నీరజ్ 88.20మీటర్లకు పరిమితమయ్యాడు. ఇదే అదనుగా అప్పటి వరకు చోప్రా దరిదాపుల్లో ఉన్న జులియన్ వెబర్ ఆరో ప్రయత్నంలో ఏకంగా 91.06మీటర్లు విసిరి అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. కెరీర్లో తొలిసారి అత్యుత్తమ మార్క్ అందుకున్న వెబర్..నీరజ్‌ను రెండో స్థానానికి పరిమితం చేయగా, అండర్సన్ పీటర్స్(85.64మీ)మూడో స్థానంలో నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

