హైదరాబాద్, ఆట ప్రతినిధి: న్యూఢిల్లీ కర్నిసింగ్ షూటింగ్ రేంజ్ వేదికగా జరుగుతున్న 66వ జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో మన షూటర్లు పతకాలతో అదరగొట్టారు. శుక్రవారం జరిగిన వేర్వేరు విభాగాల్లో రెండు స్వర్ణాలు(టీమ్ ఈవెంట్), కాంస్యం (వ్వక్తిగత), రెండు కాంస్యాలు(టీమ్ ఈవెంట్) ఖాతాలో వేసుకున్నారు.
పురుషుల జూనియర్ 50మీ రైఫిల్ ప్రోన్తో పాటు 50మీ రైఫిల్ ప్రోన్ సివిలియన్లో రోహిత్ రెండు కాంస్య పతకాలు దక్కించుకున్నాడు. అదే జోరు కొనసాగిస్తూ రోహిత్, అబ్దుల్ ఖాలిక్, అద్నాన్ కుష్రోవ్తో కూడిన త్రయం 1852.6 స్కోరుతో స్వర్ణం కైవసం చేసుకుంది. 50మీటర్ల రైఫిల్ ప్రోన్ తెలంగాణ కాంస్యం సొంతం చేసుకుంది.