ఖైరతాబాద్, నవంబర్ 3: సుమన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 27న
కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో 25వ జాతీయ కరాటే చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సినీ నటుడు సుమన్ తెలిపారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. గ్రాండ్ చాంపియన్‌కు అందజేసే సీఎం కప్‌ను అకా డమీ జాతీయ ప్రధాన కార్యదర్శి లింగయ్య, రాష్ట్ర కార్యదర్శి అందె శ్రీనివాస్, చీఫ్ ఆర్గనైజర్ జల్లెల శ్రీనివాస్, ప్రెస్‌క్లబ్ కోశాధికారి రాజేశ్‌తో కలిసి ఆవిష్కరించారు.